కరోనా దెబ్బకు భారీగా నష్టపోయిన తెలంగాణ మంత్రి

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్ కారణంగా మంత్రి ఈటల రాజేందర్‌కు వ్యాపారంలో భారీగా నష్టం వచ్చింది.

 • Share this:
  కరోనా ఎఫెక్ట్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉందని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ వెయ్యి కోట్లకు పైగా నష్టపోయింది. ఈ విషయాన్ని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పౌల్ట్రీ పరిశ్రమ వ్యాపారంలో ఉన్న మంత్రి ఈటల రాజేందర్ సైతం... కరోనా కారణంగా నష్టపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. కరోనా కారణంగా తాను కూడా వ్యాపారపరంగా దాదాపు రూ. 8 కోట్లు నష్టపోయినట్టు వివరించారు. మిగతా రంగాలతో పోలిస్తే కరోనా కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ ఎక్కువగా నష్టపోతోంది.

  కరోనా దెబ్బకు నష్టపోయిన తెలంగాణ మంత్రి | Telangana minister etela rajendar got 8 crore rupees loss due to corona virus ak
  మంత్రి ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)


  చికెన్ తినడం వల్ల కరోనా వ్యాపిస్తుందనే పుకార్లు మొదలుకావడంతో... కొద్దిరోజులుగా చికెన్ అమ్మకాలు బాగా పడిపోయాయి. దీంతో ధరలు కూడా బాగా తగ్గాయి. ప్రజల్లో ఉన్న ఈ భయాలను పోగొట్టేందుకు చికెన్ మేళాను కూడా నిర్వహించారు పౌల్ట్రీ యజమానులు. దీని వల్ల పరిస్థితిలో మార్పు వస్తుందని అంచనా వేశారు. కానీ అంతలోనే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో... ప్రజల్లో కరోనా వైరస్ పట్ల ఉన్న భయాందోళనలు మరింత పెరిగిపోయాయి. చికెన్, కోడిగుడ్ల వినియోగం మళ్లీ పడిపోయింది.
  Published by:Kishore Akkaladevi
  First published: