• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA MINISTER ETELA RAJENDAR COMMENTS BECOME HOT TOPIC IN TRS AND STATE POLITICAL CIRCLES AK

Telangana: కేసీఆర్ నిర్ణయాన్ని ముందే ఊహిస్తున్న మంత్రి ?.. అందుకే ఈ దూకుడు

Telangana: కేసీఆర్ నిర్ణయాన్ని ముందే ఊహిస్తున్న మంత్రి ?.. అందుకే ఈ దూకుడు

సీఎం కేసీఆర్ (ఫైల్ పోటో)

Telangana: రైతు ఉద్యమంలో తన పాత్ర’ గురించి స్పష్టంగా వివరించిన ఈటల రాజేందర్.. ఆ మరుసటి రోజు పార్టీలు, జెండాలు ఉండకపోయినా... ప్రజల పక్షాన నేను ఉంటానని అన్నారు. ఆ తరువాత కూడా ప్రతి రోజు రైతులకు సంబంధించిన సమస్యలపై మాట్లాడుతున్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.

  • Share this:
    తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ కొద్దిరోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయన టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడకపోయినా.. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోయినా.. ఆయన చేస్తున్న కామెంట్స్ మాత్రం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. సోమవారం వీణవంక ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతుబంధు పథకంలోని లోపాలు, రైతు ఉద్యమంలో తన పాత్ర’ గురించి స్పష్టంగా వివరించిన ఈటల రాజేందర్.. ఆ మరుసటి రోజు పార్టీలు, జెండాలు ఉండకపోయినా... ప్రజల పక్షాన నేను ఉంటానని అన్నారు. ఆ తరువాత కూడా ప్రతి రోజు రైతులకు సంబంధించిన సమస్యలపై మాట్లాడుతున్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.

    అయితే రాజకీయాల్లో సైలెంట్‌గా ఉంటూ తన పని తాను చేసుకుపోయే ఈటల రాజేందర్... కొద్దిరోజులుగా ఎందుకు ఎక్కువగా ఫోకస్ అవుతున్నారనే దానిపై టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే తెలంగాణలో, టీఆర్ఎస్‌లో త్వరలోనే జరగబోయే మార్పులు ఎలా ఉంటాయో ఊహించి ముందుగానే ఈటల రాజేందర్ ఈరకమైన వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. త్వరలోనే కేసీఆర్ సీఎంగా తప్పుకుని కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఆ క్రమంలోనే కేటీఆర్ కేబినెట్‌లో ఈటలకు చోటు దక్కకపోవచ్చనే చర్చ కూడా సాగుతోంది.

    Minister Etela rajender, corona vaccination to journalists, corona vaccination n India, corona vaccination In Telangana, Coronavirus, Etela Rajender Launches Pulse Polio Program, Etela Rajender Comments, మంత్రి ఈటల రాజేందర్, మీడియా సిబ్బందికి కరోనా వ్యాక్సిన్, తెలంగాణ, పల్స్ పోలియో
    మంత్రి ఈటల రాజేందర్ (పైల్ ఫోటో)


    ఈ కారణంగానే ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే సీఎం అయ్యేందుకు కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని.. ఆయన సీఎం అయితే తప్పేంటనే చర్చకు ముందుగా తెరలేపింది మంత్రి ఈటల రాజేందరే కావడం విశేషం. అయినా ఆయన ఈరకమైన వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. మొత్తానికి కొద్దిరోజులు నుంచి గతానికి భిన్నంగా రాజకీయాల్లో తన స్వరం వినిపిస్తున్న ఈటల రాజేందర్ ఆంతర్యం ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు