కేంద్రానికి బొంద మీది ప్యాకేజీ.. తెలంగాణ మంత్రి కీలక వ్యాఖలు

ఇక ముస్లింల వల్లే క‌రోనా విస్తృతి అయిందనడం పూర్తిగా నిజం కాదని, ఒకరిద్దరు చేసిన త‌ప్పుని అంద‌రికీ రుద్దొద్దని మంత్రి ఎర్రబెల్లి హితవు పలికారు. మ‌రో రెండేళ్ల వరకు క‌రోనాతో క‌లిసి జీవించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: May 20, 2020, 12:41 PM IST
కేంద్రానికి బొంద మీది ప్యాకేజీ.. తెలంగాణ మంత్రి కీలక వ్యాఖలు
ఎర్రబెల్లి దయాకర్ రావు
  • Share this:
కరోనా లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు.. అయితే, రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై కొన్ని రాష్ట్రాలు పెదవి విరిస్తున్నారు.. ఆర్థిక నిపుణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ అంకెలగారిడీగా వ్యాఖ్యానించగా.. తాజాగా స్పందించిన తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. బీజేపీది బొంద మీది ప్యాకేజీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని తాకట్టు పెడితే అప్పులిస్తారా అంటూ మండిపడ్డారు. ఇక ముస్లింల వల్లే క‌రోనా విస్తృతి అయిందనడం పూర్తిగా నిజం కాదని, ఒకరిద్దరు చేసిన త‌ప్పుని అంద‌రికీ రుద్దొద్దని మంత్రి ఎర్రబెల్లి హితవు పలికారు. మ‌రో రెండేళ్ల వరకు క‌రోనాతో క‌లిసి జీవించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. టీకాలు వ‌చ్చినా స‌రే.. ఈ ప‌రిస్థితిలో మార్పు ఉండ‌క‌పోవ‌చ్చని శాస్త్రవేత్తలే అంటున్నారని గుర్తుచేశారు.

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కుద‌వ పెడితే అప్పులిస్తారట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. క‌రోనా క‌ష్టకాలంలో ఆదుకోవాల్సింది పోయి.. అక్కర‌కు రాని ప్యాకేజీలు ప్రకటించారని దుయ్యబట్టారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంట‌ల‌కు క‌నీస మ‌ద్దతు ధ‌ర వ‌చ్చే ప‌రిస్థితి లేదన్నారు. తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన విధంగా సాగు చేద్దాం.. షుగ‌ర్ ఫ్రీ తెలంగాణ సోనానే సాగు చేద్దాం అని పిలుపునిచ్చారు. మ‌క్కలు ఈ సీజన్‌కు అస‌లు వేయ‌వద్దని, దేశంలో తెలంగాణ ప‌త్తికి మంచి డిమాండ్ ఉందన్నారు. మ‌హ‌బూబాబాద్ మిర్చీ, ప‌ల్లీకి కూడా డిమాండ్ ఉన్నట్టు వెల్లడించారు.
Published by: Narsimha Badhini
First published: May 20, 2020, 12:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading