Home /News /telangana /

TELANGANA MAY RECEIVES MODERATE RAIN IN SOME PLACES BS

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు.. తగ్గిన చలి..

ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

    తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ జల్లులు పడే ఛాన్స్ ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వెల్లడించింది. వర్షాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా చలి తగ్గింది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణంతో పోల్చితే 5.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, బుధవారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం వానలు పడ్డాయి. నాంపలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Hyderabad Rains, Rains, Telangana News, WEATHER

    తదుపరి వార్తలు