టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకి చెందిన కాంప్లెక్స్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి.. !

ప్రతీకాత్మక చిత్రం

ఓ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు చెందిన కాంప్లెక్స్‌లో అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆ వార్త సంచలనంగా మారింది.

  • Share this:
    ఓ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు చెందిన కాంప్లెక్స్‌లో అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆ వార్త సంచలనంగా మారింది. వివరాలు.. నిజమాబాద్‌ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి చెందిన ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. అయితే ఆ కాంప్లెక్స్‌లో మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన షేక్ షాదుల్లా (29)అనుమానాస్పదస్థితిలో మృతి చెంది కనిపించాడు. ఇది గుర్తించిన స్థానికులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్థానికులు కథనం ప్రకారం.. మృతుడు షాదుల్, అతని స్నేహితుడు నద్ఢులు కాంప్లెక్స్‌లోకి దొంగతనానికి వచ్చారు.. ఆ సమయంలో వారిపై అక్కడున్న వారు దాడి చేయగా షాదుల్లా మృతిచెందాడని అంటున్నారు.

    ఇక, స్థానికుల సమాచారంతో మృతుడు షాదుల్లా కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. షాదుల్లా మృతిచెందిన చోటు ఏం జరిగిందో తమకు తెలియదని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. వాస్తవాలు ఏమిటో తమకు చెప్పడం లేదని, ఘటన స్థలంలోకి సెక్యూరిటీ సిబ్బంది వెళ్లనివ్వడం లేదని వారు ఆరోపించారు. షాదుల్లా మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
    Published by:Sumanth Kanukula
    First published: