హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: మోదీ వల్ల తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల నష్టం.. సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు

CM KCR: మోదీ వల్ల తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల నష్టం.. సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు

KCR(Photo :Twitter)

KCR(Photo :Twitter)

Telangana: తెలంగాణ మారినట్లుగానే.. దేశం కూడా మారాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించి.. జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించేలా ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మహబూబ్ నగర్ (Mahbubnagar) జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్ (CM KCR).. కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, కలెక్టరేట్ భవన సముదాయాలను ప్రారంభించిన అనంతరం.. ఎంవీఎస్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేతృత్వంలోని బీజేపీ సర్కార్.. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన దొంగలను పట్టుకొని జైల్లో వేశామని అన్నారు. తెలంగాణ మారినట్లుగానే.. దేశం కూడా మారాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించి.. జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించేలా ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

వేదనలు, రోదనలతో కూడిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు మారిపోయింది. అన్ని ప్రాంతాలూ పచ్చబడ్డాయి. పచ్చని పంటలను చూసి చాలా సంతోషమేసింది. ఒకప్పుడు మహబూబ్ నగర్ నుంచి బొంబాయికి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. కానీ ఇప్పడు పక్క రాష్ట్రాల నుంచే ఇక్కడికి వస్తున్నారు.

మిషన్ కాకతీయ వల్ల చెరువులన్నీ నిండి పంటల పొలాలకు సాగు నీరు వస్తోంది. మిషన్ కాకతీయ వల్ల ఇంటింటికీ సాగు నీరు అందుతోంది. రైతు బంధు, రైతు బీమా పథకాలతో వ్యవసాయం వృద్ధి సాధించింది.

2014లో మనతో పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయింది. తెలంగాణ ప్రభుత్వం చేసి పని కూడా కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. పనిచేయమని అడిగితే.. ప్రభుత్వాన్ని కూల్చుతామని బెదిరిస్తున్నారు.

మన జీడీపీ పదుకొండున్న లక్షల కోట్లు కాదు.. 14 లక్షల కోట్లుగా ఉండేది. కేంద్ర అసమర్థ పాలన వల్లే తెలంగాణ మూడున్నర లక్షల కోట్ల నష్టపోయింది. మనతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తేనే దేశం అభివృద్ధి చెదుతుంది. ఎలాంటి సహకారం అందించడం లేదు.

పాలమూరు ప్రాజెక్టు కడతామని మోదీ అన్నారు. కానీ ఎన్ని సార్లు లేఖ రాసినా స్పందించడం లేదు. కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చలని ఎప్పటి నుంచో అడుగుతున్నాం. కానీ ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు.

తెలంగాణ వాటా చెప్పడానికే ఇన్ని ఏళ్ల సమయం పాడితే.. ఇక ఆ జలాలు వచ్చేందుకు ఇంకా ఎన్నేళ్లు పట్టొచ్చు. మోదీ తెలంగాణ ప్రభుత్వ కాళ్లల్లో కట్టె పెడుతున్నారు.

తెలంగాణలో టీచర్ జాబ్స్ జాతర.. 12 వేల ఖాళీలతో నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ప్రోత్సహించేది పోయి.. అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఏవైనా ఎదురు మాట్లాడితే.. ప్రభుత్వాన్ని కూలదోస్తామని బెదిరిస్తున్నారు. ప్రధాని మోదీయే స్వయంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు.

ఈ భారత దేశం కోసమేనా మనం కలలుగన్నది. స్వాతంత్య్ర సమరయోధులు తమ జీవితాలను త్యాగం చేసి తెచ్చిన స్వాతంత్య్ర ఇందుకోసమేనా..? కేంద్రానికి మంచి నీళ్లు ఇవ్వడం చేతకాదు. సాగు నీరు ఇవ్వడం చేతకాదు. కంపెనీలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు.

చిల్లర ఎత్తుగడలను ప్రజలు గమనించాలి. అర్ధమైనా గానీ అర్థం కానట్లు ఉంటే.. అందరి బతుకులు ఆగమైతాయి. భారత ప్రజల జీవనాడి కలుషితం చేస్తున్నారు. ఉన్మాదం, విద్వేషాలు, భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి వారిని గట్టిగా దెబ్బకొట్టాలి.

మొన్న కొందరు దొంగలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు వస్తే.. వారిని పట్టుకొని జైల్లో వేశాం. దేశంలో ఎక్కడి నుంచో ఓ చోట తిరుగుబాటు మొదలవ్వాలి. తెలంగాణ నుంచే అది మొదవులవుతుంది. లేదంటే మన జీవితాలు నాశనమవుతాయి.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోల పథకం పనులు 90శాతం పూర్తయ్యాయి. మిగతా పనులను కూడా త్వరలోనే పూర్తి చేసి.. జిల్లాల్లోని ప్రతి వ్యవసాయ భూమికి సాగు నీరందిస్తాం.

మహబూబ్ నగర్ పారిశ్రామిక హబ్‌గా మారనుంది. స్పోర్ట్స్ స్టేడియం, ఆడిటోరియం కావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. వెంటనే మంజూరు చేస్తున్నాం.  కర్నాటక, మహారాష్ట్రాల సరిహద్దుల ప్రజలు తెలంగాణలో కలుస్తామంటున్నారు. గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి.

నేను మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ కోసం కొట్లాడి సాధించుకున్నాం. అందువల్ల ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అందుకే నియోజక అభివృద్ధి నిధులను అదనంగా ఇస్తా. 14 అసెంబ్లీ నియెజకవర్గాలకు రూ. 15 కోట్ల చొప్పున..రూ. 220 కోట్లను మంజూరు చేస్తాం.

సొంత స్థలం ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.3లక్షలు ఇస్తాం.  ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి అదనంగా వెయ్యి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలను చేసుకుంటూ.. అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చేస్తాం. నేను మీతోనే ఉంటాను. మీరు కూడా నన్ను ఆశీర్వదించాలి.

జాతీయ రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర వహించాలి. బీఆర్ఎస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్దాం. ఈ దేశం బాగుపడితేనే మనం బాగుపడతాం. తెలంగాణలాగే దేశాన్ని మార్చుదాం. అద్భుతమైన దేశ ప్రగతి కోసం తెలంగాణ నుంచే పునాది వేద్దాం.

First published:

Tags: CM KCR, Mahbubnagar, Telangana

ఉత్తమ కథలు