Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: May 23, 2019, 2:31 PM IST
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి
కారు, సారు, పదహారు అంటూ టీఆర్ఎస్ చేసిన నినాదానికి చెక్ పెడుతూ... తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంది. నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గంలో టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ 19,070 ఓట్లతో గెలుపొందగా, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 4500 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డి లీడ్లో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ 0 లేదా 1 స్థానానికి పరిమితం అవుతుందని వచ్చినా... అందుకు విరుద్ధంగా... కాంగ్రెస్ ఇప్పటికే రెండు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. మరోస్థానం కూడా గెలిస్తే, అది టీఆర్ఎస్ 16 స్థానాల ఆశలకు గండికొట్టినట్లే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపుతో... ఇప్పుడు హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి... ఉత్తమ్... లోక్ సభకు వెళ్లనున్నారు. ఫలితంగా ఉప ఎన్నిక జరగనుంది. ఉత్తమ్ హుజూర్ నగర్ స్థానంలో తన భార్యను బరిలో దింపే అవకాశాలున్నాయి.
తన గెలుపును తన పుట్టిన రోజుకు ప్రజలు ఇచ్చిన గిఫ్టుగా అభివర్ణించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమితో... ఉత్తమ్ కుమార్ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓ దశలో ఆయన్ని తప్పించి, ఇంకెవరికైనా ఆ పదవిని ఇవ్వాలనే డిమాండ్లు వినిపించాయి. ఐతే... కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మాత్రం... లోక్ సభ ఎన్నికలపై దృష్టిసారించాలని కొన్ని సూచనలు చేశారు. ఐతే... లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ పెద్దగా ఆశలు పెట్టుకోలేదనీ, కానీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాల ఆశలపై నీళ్లు చల్లుతూ... కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం కూడా టీఆర్ఎస్కి షాకింగ్ తీర్పే.
ఇవి కూడా చదవండి :
లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన సన్నీలియోన్... ఎలాగంటే...
ఇక నవరత్నాలు, మేనిఫెస్టో అమలుపై వైసీపీ దృష్టి... రైతులకు అధిక ప్రాధాన్యం...
రావాలి జగన్... కావాలి జగన్... గ్రాండ్ సక్సెస్...
లగడపాటి సర్వే సన్యాసమేనా... RG ఫ్లాష్ టీమ్ ఫసక్...
Published by:
Krishna Kumar N
First published:
May 23, 2019, 2:17 PM IST