హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఇక సంబరాలే... టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపు...

ఇక సంబరాలే... టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపు...

సీఎం కేసీఆర్.. (Photo: facebook)

సీఎం కేసీఆర్.. (Photo: facebook)

Telangana Lok Sabha Election Results 2019 : మరోసారి టీఆర్ఎస్‌కి భారీ విజయం తథ్యమన్న కేసీఆర్... సంబరాలకు పిలుపిచ్చారు.

అందరూ ఊహించినట్లే... తెలంగాణలో రాష్ట్రంలోని మొత్తం లోక్‌సభ స్థానాలను (17లో 16) క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, సంబరాలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. జిల్లాలోని మంత్రులు, పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బుధవారం ఆయన తన ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతున్నాయనీ, 16 లోక్‌సభ స్థానాలను టీఆర్ఎస్‌ గెలుచుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలనీ, అవాంచనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని కేసీఆర్ సూచించారు. ఎగ్జిట్‌పోల్స్‌లో కూడా టీఆర్ఎస్ దాదాపు 16 సీట్లు గెలుచుకుంటుందనీ, లేదంటే ఒకట్రెండు స్థానాలు కాంగ్రెస్‌కి దక్కుతాయని తెలిపాయి.


విపక్షాలు మళ్లీ చిత్తుగా ఓడిపోబోతున్నాయన్నారు కేసీఆర్. లెక్కింపు సమయంలో ఏదైనా సమస్య వస్తే, వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల విధానానికి టీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటించినట్టు కేసీఆర్ తెలిపారు. ఈ విషయంలో విపక్షాలది అనవసర రాద్దాంతమని కొట్టిపారేశారు. ఈవీఎంలలో ఎలాంటి తీర్పు వస్తే, దాన్ని తాము శిరసావహిస్తామన్నారు కేసీఆర్.


 


ఇవి కూడా చదవండి :


మధ్యాహ్నానికి ఫలితం తెలిసిపోతుంది... ఏపీ ఈసీ ఏం చెప్పారంటే...


ఏపీలో తొలి ఫలితం నరసాపురం, మదనపల్లి నుంచే... ఎందుకంటే...

First published:

Tags: CM KCR, Telangana Election 2018

ఉత్తమ కథలు