టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి గాయాలు... లిఫ్ట్ వైర్ తెగిపోయి...

ఎమ్మెల్యే స్వల్పంగా గాయపడ్డారు. తర్వాత మైనంపల్లిని సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 6:58 AM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి గాయాలు... లిఫ్ట్ వైర్ తెగిపోయి...
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
  • Share this:
Telangana Lok Sabha Election Result 2019 : టీఆర్ఎస్ మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే, మైనంపల్లి హనుమంతరావు గాయపడ్డారు. చిక్కడపల్లిలోని ఓ హోటల్‌కి వెళ్లిన ఆయన... అక్కడి లిఫ్టులోకి వెళ్లారు. ఐతే... సడెన్‌గా లిఫ్టు వైర్‌ తెగిపోయింది. అందులో ఉన్న మైనంపల్లికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై స్థానికులు తమ అభిప్రాయం చెప్పారు. గాంధీనగర్‌ టీఆర్ఎస్ నేత ఎర్రం శ్రీనివాస్‌ గుప్తా కొడుకు తొట్టెల కార్యక్రమానికి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయ్యాక ఎమ్మెల్యే లిఫ్టులో కిందకు వెళ్తున్న క్రమంలో... గ్రౌండ్ ఫ్లోర్‌కు 2 అడుగుల ఎత్తులో ఉండగా లిఫ్టు వైర్‌ తెగిపోయింది. ఒక్కసారిగా లిఫ్టులో ఉన్నవారంతా కిందపడిపోయారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే స్వల్పంగా గాయపడ్డారు. తర్వాత మైనంపల్లిని సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమకాలికి గాయమైనట్లు డాక్టర్లు వివరించారు. లిఫ్టులో పరిమితికి మించి ఎక్కువ మంది ఎక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. గాయపడిన ఎమ్మెల్యే మైనంపల్లిని మంత్రి మల్లారెడ్డి, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరామర్శించారు. మరేం ప్రమాదం లేదని మీడియాకు వివరించారు.

 

ఇవి కూడా చదవండి :

మధ్యాహ్నానికి ఫలితం తెలిసిపోతుంది... ఏపీ ఈసీ ఏం చెప్పారంటే...

 

ఏపీపైనే అందరి చూపు... అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు...

 ఏపీలో తొలి ఫలితం నరసాపురం, మదనపల్లి నుంచే... ఎందుకంటే...

 

ఏపీలో పోస్టల్ బ్యాలెట్, పోస్టల్ సర్వీస్ ఓట్ల పూర్తి వివరాలు తెలుసా...
First published: May 23, 2019, 6:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading