Home /News /telangana /

TELANGANA LOGS 2047 NEW COVID CASES AND 3 DEATHS IN LAST 24HRS MKS

Telangana covid update: వెల్లువలా వైరస్ వ్యాప్తి.. కొత్తగా 2047 కేసులు, మరో ముగ్గురు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో కొవిడ్ పరిస్థితికి సంబంధించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం రాత్రి బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా 2,047 పాజిటివ్‌ కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. రోజువారీ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, పోలీస్, ఆర్టీసీ సిబ్బందితోపాటు సామాన్యులూ వరుసగా కరోనా బారినపడుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొవిడ్ తో ఆస్పత్రిలో చేరగా, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హోం క్వారంటైన్ లో ఉన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి రెండోసారి కరోనా సోకింది. ఆదిలాబాద్ జిల్లాలో డ్యూటీలో ఉన్న కండక్టర్ కొవిడ్ పాజిటివ్ గా తేలడంతో ప్రయాణికులంతా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి.

తెలంగాణలో కొవిడ్ పరిస్థితికి సంబంధించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం రాత్రి బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 55,883 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,047 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,09,209కి చేరింది.

CM KCR: మరో సంచలనం.. పాలనలో భారీ ప్రక్షాళన.. జీవో 317 సక్సెస్.. తర్వాతి స్టెప్ ఇదే..



నిన్న ఒక్కరోజే మహమ్మారి కాటు వల్ల ముగ్గురు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,057కి చేరింది. ఇక కరోనా బారి నుంచి నిన్న 2,013 మంది కోలుకున్నట్ల బులెటిన్‌లో వెల్లడించారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 22,048 ఐసోలేషన్, యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆదివారం 1,174 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో తాజాగా 1,53,699 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు..
Published by:Madhu Kota
First published:

Tags: Coronavirus, Covid, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు