Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్‌ ఔట్... కర్ఫ్యూ కొనసాగిస్తారా?... ఆ ప్రయోగంతో...

తెలంగాణలో లాక్‌డౌన్‌ ఔట్... కర్ఫ్యూ కొనసాగిస్తారా? (File Image)

Telangana Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేయాలా వద్దా అనే అంశంపై ప్రభుత్వం చేపట్టిన తెలివైన ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అందుకే ఇక లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

  • Share this:
    Telangana Lockdown: దేశంలోని చాలా రాష్ట్రాలతో పోల్చితే... తెలంగాణలో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. మరణాలు కూడా తక్కువే వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించబోతోంది. ఇందులో... సీఎం కేసీఆర్... తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగించాలా వద్దా అనేది డిసైడ్ చెయ్యనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే... సాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత కఠిన లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఇది జూన్ 9 వరకూ అమల్లో ఉంటుంది. ఈ లాక్‌డౌన్ వల్ల ఆల్రెడీ మంచి ఫలితాలే వచ్చాయని భావిస్తున్న ప్రభుత్వం... ఇంకా దీన్ని కొనసాగించడం అవసరం లేదు అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    కర్ఫ్యూ మాత్రమే:
    పగటిపూట లాక్‌డౌన్ ఎత్తేసి... రాత్రి కర్ఫ్యూను కొనసాగించాలి అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిసింది. తద్వారా సాధారణ పరిస్థితులు వస్తాయనీ... ఆర్థిక వ్యవస్థ మళ్లీ పురోగతి చెందుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రివేళ ఎలాగూ ఎక్కువ మంది తిరగరు కాబట్టి... రాత్రివేళ కర్ఫ్యూ అమల్లో ఉన్నా పెద్దగా సమస్యలు రావని ప్రభుత్వం లెక్కలు వేస్తున్నట్లు తెలిసింది.

    ఆస్పత్రులు ఖాళీ:
    తెలంగాణలో కొన్ని రోజులుగా... ఆస్పత్రులకు కరోనాతో వస్తున్న వారి సంఖ్య బాగా తగ్గుతోంది. అదే సమయంలో రికవరీలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 60 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయి. దానికి తోడు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు, మందులు అన్నీ సమకూర్చుకుంది. అదే సమయంలో... వ్యాక్సిన్ల పంపిణీని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. అందువల్ల లాక్‌డౌన్ ఎత్తివేసినా ఏం కాదు అనే కాన్ఫిడెన్స్ ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది.

    ఆ ప్రయోగం సక్సెస్:
    తెలంగాణలో కరోనా టెస్టులు సరిగా చెయ్యట్లేదని హైకోర్టు మండిపడటంతో... టెస్టుల సంఖ్యను బాగా పెంచిన ప్రభుత్వం... లక్షకు పైగా టెస్టులు చేయించింది. అంతలా చేయించినా... కొత్త కేసుల సంఖ్య భారీగా పెరగలేదు. అందువల్ల వాస్తవంగానే కరోనా తక్కువగానే ఉంది అని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి లాక్‌డౌన్ ఎత్తివేసినా... అంతగా కేసులు పెరగకపోవచ్చు అనే అంచనా ఉంది.

    కర్ఫ్యూ ఇలా ఉంటుందా:
    రాత్రి 7 గంటలు లేదా 9 గంటల వరకు వ్యాపారాలకు అవకాశం ఇచ్చి... రాత్రి 8 లేదా 10 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా ఓ 10 రోజులు చేశాక... పరిస్థితి ఎలా ఉందో పరిశీలించి... అప్పుడు నెక్ట్స్ ఏం చెయ్యాలో డిసైడ్ చేద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. అంటే... జూన్ 20 వరకూ కర్ఫ్యూ ఉంటుంది అనుకోవచ్చు.

    ఇది కూడా చదవండి: India Covid: గుడ్‌న్యూస్... ఇండియాలో లక్షకు తగ్గిన కరోనా కొత్త కేసులు

    ముందున్న థర్డ్‌వేవ్:
    ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ టెన్షన్ ఉంది. ఇంకా అది రాకపోయినా... వస్తే కచ్చితంగా బలంగా ఎదుర్కోవాలని రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. సెకండ్ వేవ్ విషయంలో జరిగిన అజాగ్రత్త, నిర్లక్ష్యం... థర్డ్ వేవ్ విషయంలో జరగకూడదని అనుకుంటున్నాయి. ముఖ్యంగా పిల్లల్ని కాపాడే విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదనుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. దీనిపై మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలో... లోతుగా చర్చించనుంది. పిల్లలకు ట్రీట్‌మెంట్, ఆస్పత్రుల్లో సదుపాయాలు, నీలోఫర్ పిల్లల ఆస్పత్రిలో పరిస్థితులు, నిమ్స్, గాంధీ ఆస్పత్రిలో ఏర్పాట్లపై వివరంగా చర్చించనుంది.
    Published by:Krishna Kumar N
    First published: