• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • TELANGANA LOCKDOWN GOVERNMENT MAY GIVE MORE RELAXATIONS AFTER JUNE 19TH SU

Telangana Lockdown: జూన్ 19 తర్వాత సడలింపులు.. సినిమా థియేటర్స్, బార్లకు అనుమతి ఉంటుందా..?

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19 వరకు లాక్‌డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోనుందనే ఆసక్తి చాలా మందిలో నెలకొంది.

  • Share this:
    తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19 వరకు లాక్‌డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 19వ తర్వాత మరింతగా సడలింపు ఉంటుందని సమాచారం. కరోనా తీవ్రత నేపథ్యంలో.. వైరస్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం తొలుత నైట్ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. మే 12 నుంచి 30వ తేదీ వరకు లాక్‌డౌన్ అమలు చేసింది. ఈ సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపులు ఇచ్చారు. ఆ తర్వాత జూన్ 9వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన ప్రభుత్వం.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు సమయాన్ని పొడిగించింది. ఇక, జూన్ 10 నుంచి 19వరకు .. సాయంత్రం 6 గంటలనుంచి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఇప్పుడు జూన్ 19వ తేదీ తర్వాత ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోనుందనే ఆసక్తి చాలా మందిలో నెలకొంది. అయితే 19వ తేదీ తర్వాత మరో వారం పది రోజుల పాటు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉండనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

    ఇక, బార్లు, సినిమా హాళ్లు, జిమ్‌లకు మాత్రం జూన్ 19 తర్వాత అనుమతి లభించకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. జూలైలో బార్లు, సినిమా హాళ్లు, జిమ్‌లకు 50 శాతం అక్యుపెన్సితో అనుమతి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ రేట్ 1.5 శాతానికి తగ్గినట్టు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో.. ప్రభుత్వం సడలింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

    Paytm యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. పేటీఎంలో కోవిడ్ వ్యాక్సిన్‌ స్లాట్‌ బుకింగ్‌.. ఎలా బుక్ చేసుకోవాలంటే..

    తెలంగాణలో కొత్తగా 1,511 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 6,04,880 లకు చేరింది. కొత్తగా కొవిడ్‌-19 కారణంగా 12 మంది మరణించారు. దీంతో మొత్తం మృతిచెందిన వారి సంఖ్య 3,496కి చేరింది. తాజాగా కరోనా నుంచి 2,175 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 20,461 గా ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1.10,681 కరోనా పరీక్షలు నిర్వహించారు.
    Published by:Sumanth Kanukula
    First published: