Home /News /telangana /

TS MLC : ముగిసిన విత్ డ్రా సమయం.. 6 స్థానాల్లో టీఆర్ఎస్ ఏకగ్రీవం.. ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత

TS MLC : ముగిసిన విత్ డ్రా సమయం.. 6 స్థానాల్లో టీఆర్ఎస్ ఏకగ్రీవం.. ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత

ఎన్నిక పత్రాన్ని తీసుకుంటున్న ఎమ్మెల్సీ కవిత

ఎన్నిక పత్రాన్ని తీసుకుంటున్న ఎమ్మెల్సీ కవిత

TS MLC : తెలంగాణలోని స్థానిక సంస్థల కోటాలో ( TS MLC) టీఆర్ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవాల హవా కొనసాగింది..నేటితో నామినేషన్ ఉప సంహరణ ముగియడంతో ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఏకగ్రీవం అయిన స్థానాల్లో వరంగల్ ,నిజామాబాద్, మహబుబ్‌నగర్ ‌తో పాటు రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులు ఉన్నారు.

ఇంకా చదవండి ...
    స్థానిక సంస్థల ఎన్నికల పోరులో ఏకగ్రీవాల జోరు కొనసాగింది.. నేటితో నామినేషన్ల ఉపసంహర గడువు ముగియడంతో పలువరు ఇండిపెండెండ్ అభ్యర్థులు తమ నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో పలు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఏకగ్రీవం అయిన స్థానాల్లో వరంగల్ ,నిజామాబాద్, మహబుబ్‌నగర్ ‌తో పాటు రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులు ఉన్నారు. వీరంతా ఇప్పటికే ఎన్నికల కమిషన్ చేత ఎన్నిక పత్రాలను కూడా తీసుకున్నారు..

    ఇక అదిలాబాద్ జిల్లాలో ఉప సంహరణ సమయంలో నాటకీయ పరిణామాలు చేసుకోవడంతో పాటు కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా దండె విఠల్ నామినేషన్‌తో పాటు మరో 23 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేశారు.. కాగా 23 మంది అభ్యర్థుల్లో ముందుగా 22 మంది తమ నామినేషన్‌‌ను విత్ డ్రా చేసుకోగా..మరోకరు మాత్రం బరిలో ఉన్నారు.. అయితే ఆ అభ్యర్థి కూడా విత్ డ్రా చేసుకుందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడంతో అనుహ్యంగా పుష్పలత అనే అభ్యర్థి ఎన్నికల కార్యాలయానికి వచ్చింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. తాను విత్ డ్రా చేసుకోలేదని మీడియా ముందుకు వచ్చి చెప్పింది. కాగా పుష్పలత తుడుందెబ్బ మద్దతుతో బరిలో నిలిచినట్టు ఆమె చెప్పారు. దీంతో ఆదిలాబాద్‌లో ఇద్దరు సభ్యుల మధ్య పోటి నెలకొని ఉంది.

    ఇక ఏకగ్రీవం అయిన జిల్లాలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇండిపెండెంట్ అభ్యర్థి కొటగిరి శ్రీనివాస రావు నామినేషన్‌ను బలపరిచిన ఇద్దరు అభ్యర్థులు తమకు తెలియకుండా సంతకాలు పెట్టుకున్నారనే ఆరోపణ చేయడతో ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్ రద్దు చేశారు. దీంతో ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం అయ్యారు.

    ఇది చదవండి : ఒక్క సీటైనా గెలవాలి... కరీంనగర్‌లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్ధులు ఏకతాటిపైకి .. ?


    ఇక వరంగల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. వరంగల్ స్థానానికి 13 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్స్ వేయగా అందులో పదిమంది అభ్యర్ధుల నామినేషన్స్‌ నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయంటూ స్క్రూటినిలో రద్దులో చేశారు. ( Localbody mlc elections 2021 )ఇక మిగిలిన ముగ్గురు అభ్యర్ధులు కూడా తమ నామినేషన్స్‌ను విత్ ‌డ్రా చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవం అయ్యారు.

    మరోవైపు మహాబుబ్‌నగర్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. జిల్లాలోని రెండు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి చేరాయి. స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీశైలం వెనక్కి తగ్గారు. నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి రాతపూర్వకంగా తెలిపారు. ( Localbody mlc elections 2021 )దీంతో ఆ జిల్లా నుంచి బరిలో దిగిన టీఆర్ఎస్ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాత్రమే పోటీలో మిగలడంతో.. ఈ రెండు స్థానాలకు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది.

    రంగారెడ్డి జిల్లాలోనూ బరిలో ఎవరూ నిలవకపోవడంతో రెండు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి చేరాయి. నామినేషన్ల సమయంలోనే నామినేషన్స్ వేసేందుకు వచ్చిన వారిని అడ్డుకున్నారనే ఆరోపణలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. టీఆర్ఎస్ అభ్యర్ధులు ఇద్దరు శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి లు పోటీలో నిలిచారు. ( Localbody mlc elections 2021 )వీరి ఎన్నికను నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అధికారికంగా ప్రకటించారు.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Telangana mlc election, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు