హోమ్ /వార్తలు /తెలంగాణ /

తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం.. ఇకపై ఆ చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీలోకి..!

తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం.. ఇకపై ఆ చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీలోకి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరోవైపు ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది.

    ఓవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరోవైపు ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మూత్రపిండాలు, గుండె, కాలేయ మార్పిడి చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకం కింద చేర్చింది. రూ.30 లక్షలు ఖర్చయ్యే ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. గతేడాది ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నాయకత్వంలో భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం తీసుకుంది. అవసరమైన వారికి ఆరోగ్యశ్రీలో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లోనే ఆరోగ్యశ్రీ కింద అవయవ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు.

    అలాగే రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషిచేస్తోంది. ఈ క్రమంలోనే అవ‌య‌వ మార్పిడి శ‌స్ర్త‌చికిత్స‌లపై ఇటీవ‌లే ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ సీనియ‌ర్ వైద్యాధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. గాంధీ ఆస్ప‌త్రిలోని ఎనిమిదో అంత‌స్తులో రూ. 35 కోట్ల‌తో చేప‌ట్ట‌బోయే ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు. గాంధీలో నిర్మించనున్న అధునాత‌న ఆప‌రేష‌న్ థియేట‌ర్ కాంప్లెక్స్‌లో క‌నీసం ఆరు అత్యాధునిక ఆప‌రేష‌న్ థియేట‌ర్స్‌తో పాటు ఇత‌ర స‌దుపాయాలు క‌ల్పించ‌నున్నారు.

    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Aarogyasri, Telangana