Telangana: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

ప్రతీకాత్మక చిత్రం

కరోనా నేపథ్యంలో దేశంలోని పలు నగరాల్లో కొత్త సంవత్సరం వేడుకలపై ఆయా రాష్ట్రాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

  • Share this:
    కరోనా నేపథ్యంలో దేశంలోని పలు నగరాల్లో కొత్త సంవత్సరం వేడుకలపై ఆయా రాష్ట్రాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కొత్త రకం కరోనా వైరస్ కేసులు నమోదు అవుతుండటంతో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలను హెచ్చరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు కూడా అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. రిసార్టులు, పబ్‌లపై ప్రత్యేకంగా నిఘా పెట్టామని.. పబ్‌లు, క్లబ్‌లకు అనుమతి లేదని ఆయన చెప్పారు. అయితే ఈ పరిణామాల మధ్య రాష్ట్రంలోని మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచే ఉంటాయని అబ్కారీశాఖ తెలిపింది. మరోవైపు బార్‌లు, క్లబ్‌లు ఒంటి గంట వరకు తెరిచి ఉంచడానికి అనుమతులు ఇచ్చింది. అయితే వైన్ షాప్‌ల వద్ద, బార్‌లు, క్లబ్‌ల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.

    ఇక, కొద్ది రోజుల క్రితం సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పబ్‌లు, క్లబ్బులు, బార్లకు పర్మిషన్ లేదన్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. స్టార్ హోటళ్లలో రోజువారీ కార్యక్రమాలకు అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతామన్నారు. ఈ నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
    Published by:Sumanth Kanukula
    First published: