Telangana Liberation Day: తెలంగాణ ప్రజలకు అమిత్ షా శుభాకాంక్షలు

హైదరాబాద్ విమోచన దినోత్సవ సందర్భంగా తెలంగాణతో పాటు మరఠ్వాడా, హైదరాబాద్-కర్నాటక ప్రజలకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు.

news18-telugu
Updated: September 17, 2020, 1:47 PM IST
Telangana Liberation Day: తెలంగాణ ప్రజలకు అమిత్ షా శుభాకాంక్షలు
అమిత్ షా (credit - twitter)
  • Share this:
నేడు తెలంగాణ విమోచన దినోత్సవం. అంటే..నాటి హైదరాబాద్ సంస్థానానికి నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించి, భారతదేశంలో అధికారికంగా విలీనమైన రోజు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి కేంద్రహోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. 'హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ, మరఠ్వాడా, హైదరాబాద్-కర్నాటక ప్రాంత ప్రజలకు నా శుభాకాంక్షలు. నిజాం, రాజాకార్ల నిరంకుశ, క్రూరమైన పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించిన స్వాతంత్ర సమరయోధులకు నా సెల్యూట్' అని ట్వీట్ చేశారు అమిత్ షా.


అటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.



అప్పట్లో దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటీష్ పాలకులు స్వాతంత్ర్యం ఇస్తూనే. సంస్థానాలు ఇండియాలో కలవాలో లేదో నిర్ణయించుకునే ఛాన్స్ వాటికే ఇచ్చారు. ఫలితంగా మూడు సంస్థానాలు ఇండియాలో కలవలేదు. అవి 1.కాశ్మీర్. 2.జునాఘడ్. 3.హైదరాబాద్ (నైజాం). ఆ పరిస్థితుల్లో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి జునాఘడ్ సంస్థానాన్ని భారత్‌లో కలిసేలా చేశారు. నైజాం నవాబ్ మాత్రం విలీనానికి ఒప్పుకోలేదు. అప్పట్లో రాజాకార్ల పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారుచేసిన ఖాసిం రజ్వీ... మారణకాండకు తెగబడ్డారు. స్వాతంత్ర్యం వచ్చాక దాదాపు 13 నెలలపాటూ తెలంగాణ ప్రజలు చూడని నరకం లేదు. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేశారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఆదివాసీలు ఏకమై ఎదురుతిరిగారు. ఎంతో మంది ఉద్యమ నేతలు, కళాకారులు... అందరూ తమ ప్రాణాలు పణంగా పెట్టారు.

ఉద్యమం అత్యంత తీవ్ర స్థితికి చేరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అలర్టైంది. ఏం చేసైనా నిజాం సంస్థాన్ని ఇండియాలో కలిపేయమని సర్ధార్ వల్లభాయ్ పటేల్‌కి సూచించింది. అంతే భారత సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది. దాంతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇక లొంగిపోక తప్పదని అర్థమైంది. హైదరాబాద్ రేడియో ద్వారా... నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైందని ప్రకటించాడు. ఆ రోజు 1948 సెప్టెంబర్ 17. అందుకే ఇదే రోజును తెలంగాణ ప్రజలు తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 17, 2020, 1:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading