హోమ్ /వార్తలు /తెలంగాణ /

Amit Shah Hyderabad Tour: నేడు హైదరాబాద్‌కు అమిత్ షా..హోంమంత్రి షెడ్యూల్ వివరాలు ఇవే

Amit Shah Hyderabad Tour: నేడు హైదరాబాద్‌కు అమిత్ షా..హోంమంత్రి షెడ్యూల్ వివరాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Amit Shah Hyderabad Tour: ఈసారి కేంద్రం అధికారికంగా విలీన వజ్రోత్సవాలు జరుపుతుండగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. పరేడ్ గ్రౌండ్‌లో కేంద్రం వేడుకలకు అమిత్ షా హాజరవుతుండగా.. ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరవుతారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం  (Telangana Liberation Day) సందర్బంగా హోంమంత్రి అమిత్ షా (Amit Shah Tour) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. అమిత్ షా పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారయింది. ఇవాళ రాత్రి 09.50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. పరేడ్ గ్రౌండ్‌లో జరిగే వేడుకల్లో 08.45 నుంచి 11.10 వరకు అమిత్ షా పాల్గొంటారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో ఆయన జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆ తర్వాత బేగంపేట హరిత ప్లాజాలో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశమై తెలంగాణలో తాజా రాజకీయాలు, మునుగోడు ఉపఎన్నికలపై చర్చిస్తారు. అనంతరం సినీ నటుడు ప్రభాస్‌ (Prabhas)ను కలిసే అవకాశముంది. ఇటీవలే కేంద్రమాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు (Krishnam Raju) మరణించడంతో.. ప్రభాస్‌ను అమిత్ షా పరామర్శిస్తారని సమాచారం.

  సెప్టెంబరు 17న తెలంగాణ విలీన అమృత మహోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న కార్యక్రమంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖరాశారు.. గతంలో నిజాం రాజ్యం (హైదరాబాద్ స్టేట్)లో కర్ణాటకలోని కల్యాణ్-కర్నాటక, మహారాష్ట్రలోని మరఠ్వాడాకు చెందిన పలు జిల్లాలు ఉండడంతో విమోచన దినోత్సవాల్లో వారిని కూడా భాగస్వాములను చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపించారు.

  Hyderabad Gangrape: మెడికల్ షాప్‌కు వెళ్లిన బాలిక కిడ్నాప్... మత్తు మందు ఇచ్చి గ్యాంగ్ రేప్.. హైదరాబాద్ నడిబొడ్డున ఘోరం

  1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన అంతమై భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ తెలంగాణ ( నాటి హైదరాబాద్ స్టేట్)‌కు మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. అప్పటి నిజాం రాజు నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్... హైదరాబాద్ ఇటు ఇండియాలో గానీ.. అటు పాకిస్తాన్‌లో గానీ కలవదని స్పష్టం చేశారు. స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించారు. కానీ ప్రజలు మాత్రం భారత్‌లో కలవాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట పోలీస్ యాక్షన్ చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. అనంతరం సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగిపోయారు. ఇలా హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు స్వాతంత్య్రం.. హైదరాబాద్ స్టేట్ భారత్‌లో కలిసింది. అందుకే ఏటా సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటారు.

  ఈసారి కేంద్రం అధికారికంగా తెలంగాణ విమోచన వజ్రోత్సవాలు జరుపుతుండగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. పరేడ్ గ్రౌండ్‌లో కేంద్రం వేడుకలకు అమిత్ షా హాజరవుతుండగా.. ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొలిసారిగా అధికారికంగా సెప్టెంబరు 17 వేడుకలను నిర్వహిస్తుండడం విశేషం. బీజేపీ , టీఆర్ఎస్ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Amit Shah, Hyderabad, September 17, Telangana

  ఉత్తమ కథలు