హోమ్ /వార్తలు /తెలంగాణ /

Amit Shah: మరోసారి హైదరాబాద్‌కు అమిత్ షా.. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా సెప్టెంబరు 17న కార్యక్రమాలు

Amit Shah: మరోసారి హైదరాబాద్‌కు అమిత్ షా.. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా సెప్టెంబరు 17న కార్యక్రమాలు

(AMIT SHAH FILE PHOTO)

(AMIT SHAH FILE PHOTO)

Telangana Liberation Day: కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో సెప్టెంబర్ 17న భారీ కార్యక్రమానికి బీజేపీ ప్లాన్ చేసింది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో పరేడ్‌ను తలపెట్టింది. ఈ కవాతుకు హోంమంత్రి అమిత్ షాతో కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే లేదా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ హాజరుకానున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణలో రాజకీయాలు (Telangana Politics) రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. సీఎం కేసీఆర్ (CM KCR) ఎప్పుడు మాట్లాడినా.. కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. అటు బీజేపీ పెద్దలు కూడా కేసీఆర్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని (Telangana Liberation Day) కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అమిత్ షా 9Amit Shah) స్వయంగా హాజరుకానున్నారు. హైదరాబాద్‌ (Hyderabad)లోని పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర బలగాలతో పరేడ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమై 74 ఏళ్లు పూర్తయి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో.. విమోచన వేడుకలను ఘనంగా జరపాలని కేంద్రం భావిస్తోంది. ఈ దిశగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

  Telangana | BJP : ఖమ్మం జిల్లాలో కమలం పాగా .. వాళ్లిద్దరూ వస్తే టార్గెట్‌ పూర్తైనట్లేనా

  అమిత్ షా ఎప్పుడు తెలంగాణకు వచ్చినా సెప్టెంబరు 17 గురించి ప్రస్తావిస్తుంటారు. మజ్లిస్ పార్టీకి భయపడే.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సీఎం కేసీఆర్ అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శిస్తుంటారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక... తాము అధికారికంగా నిర్వహిస్తామని పలు సందర్భాల్ల చెప్పారు. ఇటీవల మునుగోడులో జరిగిన బహిరంగ సభలోనూ ఇదే విషయాన్ని చెప్పారు. ఐతే తెలంగాణలతో అధికారంతో సంబంధం లేకుండా... తామే సెప్టెంబరు 17న ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో సెప్టెంబర్ 17న భారీ కార్యక్రమానికి బీజేపీ ప్లాన్ చేసింది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో పరేడ్‌ను తలపెట్టింది. ఈ కవాతుకు హోంమంత్రి అమిత్ షాతో కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే లేదా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ హాజరుకానున్నారు. గతంలో నిజాం రాజ్యం (హైదరాబాద్ స్టేట్)లో కర్ణాటకలోని కల్యాణ్-కర్నాటక, మహారాష్ట్రలోని మరఠ్వాడాకు చెందిన పలు జిల్లాలు ఉండడంతో విమోచన దినోత్సవాల్లో వారిని కూడా భాగస్వాములను చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపించారు.

  1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన అంతమై... భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ తెలంగాణ ( నాటి హైదరాబాద్ స్టేట్)‌కు మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. అప్పటి నిజాం రాజు నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్... హైదరాబాద్ ఇటు ఇండియాలో గానీ.. అటు పాకిస్తాన్‌లో గానీ కలవదని స్పష్టం చేశారు. స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించారు. కానీ ప్రజలు మాత్రం భారత్‌లో కలవాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట పోలీస్ యాక్షన్ చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. అనంతరం సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగిపోయారు. ఇలా హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చి.. హైదరాబాద్ స్టేట్ భారత్‌లో కలిసింది. అందుకే ఏటా సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటారు. బీజేపీ విమోచన దినోత్సవమంటే.. టీఆర్ఎస్ విలీన దినోత్సవమంటుంది. మరి ఈ సెప్టెంబరు 17న అమిత్ షా ఏం మాట్లాడతారు? సీఎం కేసీఆర్ టార్గెట్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని అంతటా ఆసక్తి నెలకొంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Amit Shah, CM KCR, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు