హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: తెలంగాణ విమోచన వేడుకలు.. మూడు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం లేఖ

Telangana: తెలంగాణ విమోచన వేడుకలు.. మూడు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం లేఖ

ప్రధాని మోదీ, తెలంగాణ (ప్రతీకాత్మక చిత్రం)

ప్రధాని మోదీ, తెలంగాణ (ప్రతీకాత్మక చిత్రం)

Telangana Liberation Day: హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమై 74 ఏళ్లు పూర్తయి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో..ఏడాది పాటు వజ్రోత్స వేడుకలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ రాజకీయాలు (Telangana Politics)  ఇప్పుడు సెప్టెంబరు 17 చుట్టూ తిరుగుతున్నాయి. కొందరు విలీన దినోత్సవంగా జరుపుకుంటే... మరికొందరు తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతున్న వేళ.. ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం చుట్టూ.. ఎప్పుడూ లేనంత రచ్చ జరుగుతోంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని (Telangana Liberation Day) అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా విలీన వజ్రోత్సవాల (Telangana Merger Day) పేరిట వేడుకలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 17పై తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Amit Shah: మరోసారి హైదరాబాద్‌కు అమిత్ షా.. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా సెప్టెంబరు 17న కార్యక్రమాలు

తెలంగాణ విమోచ దినోత్సవాన్ని కేంద్ర సాంస్కృతిక ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ శాఖకు తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి మంత్రిగా ఉండడంతో.. ఆయన మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిజాం కాలంలోని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న తెలంగాణతో పాటు కర్నాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఉండడంతో.. ఆ రాష్ట్రాలను కూడా భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తెలంగాణ విమోచ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు మహారాష్ట్ర , కర్నాటక సీఎంలకు కిషన్ రెడ్డి (Kishan Reddy)లేఖ రాశారు. వేడుకల్లో భాగంగా సికింద్రాపరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే హాజరవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు.


బీజేపీకి కౌంటర్‌గా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈసారి సెప్టెంబరు 17 వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమై 74 ఏళ్లు పూర్తయి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో..ఏడాది పాటు వజ్రోత్స వేడుకలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇవాళ జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన అంతమై... భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ తెలంగాణ ( నాటి హైదరాబాద్ స్టేట్)‌కు మాత్రం స్వాతంత్య్రం రాలేదు. అప్పటి నిజాం రాజు నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్... హైదరాబాద్ ఇటు ఇండియాలో గానీ.. అటు పాకిస్తాన్‌లో గానీ కలవదని స్పష్టం చేశారు. స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించారు. కానీ ప్రజలు మాత్రం భారత్‌లో కలవాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట పోలీస్ యాక్షన్ చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. అనంతరం సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగిపోయారు. ఇలా హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చి.. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలిసింది. అందుకే ఏటా సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటారు.

First published:

Tags: Kishan Reddy, September 17, Telangana, Telangana Liberation Day

ఉత్తమ కథలు