ట్విటర్, ఫేస్‌బుక్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి...డీజీపీకి లాయర్ల ఫిర్యాదు

ఫేస్‌బుక్, ట్విటర్ వేదికగా ఆర్టికల్ 370 రద్దుపై ఫేక్ న్యూస్‌లు పుట్టుకొస్తున్నా ఆయా సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని న్యాయవాదులు మండిపడ్డారు.

news18-telugu
Updated: August 8, 2019, 4:42 PM IST
ట్విటర్, ఫేస్‌బుక్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి...డీజీపీకి లాయర్ల ఫిర్యాదు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. కేంద్రం నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు తప్పుబట్టుతున్నారు. అంతేకాదు ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఏం జరగబోతోందన్న దానిపై ఎవరికి వారు తమకు తోచిన అభిప్రాయాలను ట్విటర్, ఫేస్‌బుక్ వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టికల్ 370పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలంగాణ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీని కలిశారు. అంతేకాదు ట్విట్టర్, ఫేస్ బుక్ సీఈవో లపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.

370 ఆర్టికల్ రద్దు తర్వాత ట్విట్టర్, ఫేస్ బుక్ వేదిక గా చేసుకుని భారత్ జవాన్ల పై తప్పుడు ప్రసారాలు చేస్తున్న వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఫేస్‌బుక్ సీఈవో జుకెన్ బర్గ్, ట్విట్టర్ సీఈవో జాక్ ప్యాట్రిక్ డోర్ సేపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. పాకిస్థాన్ ప్రేరేపిత మూకలకు కొమ్ముకాస్తున్న ట్విట్టర్, ఫేస్ బుక్ సీఈవో లపై దేశ ద్రోహం కేసు పెట్టాలి.
తెలంగాణ న్యాయవాదులు


ఫేస్‌బుక్, ట్విటర్ వేదికగా ఆర్టికల్ 370 రద్దుపై ఫేక్ న్యూస్‌లు పుట్టుకొస్తున్నా ఆయా సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని న్యాయవాదులు మండిపడ్డారు. కేంద్రం నిర్ణయంతో ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే..మరోవైపు సోషల్ మీడియా ద్వారా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అలాంటి వాటికి అడ్డుకట్ట వేయకుండా చోద్యం చూస్తున్న సామాజిక మాధ్యమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
First published: August 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు