నేడే లష్కర్ బోనాలు..కరోనా భయంతో దర్శనాల నిలిపివేత...

ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి కారణంగా బోనాల జాతరకు బ్రేక్ ప‌డింది. బోనాలు స‌మ‌ర్పించే భ‌క్తులు.. వారి ఇళ్ల‌లోనే బోనం చేసి స‌మ‌ర్పించుకోవాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: July 12, 2020, 8:12 AM IST
నేడే లష్కర్ బోనాలు..కరోనా భయంతో దర్శనాల నిలిపివేత...
బోనల జాతర (ఫైల్ ఫొటో)
  • Share this:
తెలంగాణ‌లో బోనాల సంద‌డి మొద‌లైంది.. నేడు జూలై 12వ తేదీన‌ ల‌ష్క‌ర్ బోనాలు జ‌ర‌గ‌నున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో ఈ సారి బోనాలు పూర్తిగా నిబంధనలకు లోబడి నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి కారణంగా బోనాల జాతరకు బ్రేక్ ప‌డింది. బోనాలు స‌మ‌ర్పించే భ‌క్తులు.. వారి ఇళ్ల‌లోనే బోనం చేసి స‌మ‌ర్పించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు శుక్ర‌వారం నుంచే ఉజ్జయినీ మ‌హంకాళి ఆలయంలో ద‌ర్శ‌నాలను అధికారులు నిలిపివేశారు. ఈ నెల 12, 13న ఉత్సవాలు నిర్వహించేందుకు అర్చకులు ఏర్పాట్లు చేశారు. 12న అమ్మవారికి బంగారు బోనం, ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పిస్తారు. 13 న రంగం ఉంటుంది. ఉత్సవాలను ప్రజలంతా వీక్షించేలా ఆలయం నుంచే ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేటి ఉద‌యం 4 గంట‌ల నుంచే.. ఉజ్జ‌యినీ మ‌హాకాళి ఆల‌యంలో జ‌రిగే ఉత్స‌వాల‌ను టీవీల్లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వీక్షించ‌వ‌చ్చు.. కానీ, భ‌క్తులు బోనం స‌మ‌ర్పించ‌డంతో పాటు, ద‌ర్శ‌నానికి గానీ ఎలాంటి అనుమ‌తులు ఉండ‌వు.
Published by: Krishna Adithya
First published: July 11, 2020, 11:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading