సమ్మక్క, సారలమ్మ వనప్రవేశం.. ముగిసిన మేడారం జాతర...

నాలుగు రోజుల పాటు మేడారం జాతర అంతరంగ వైభవంగా సాగింది.

news18-telugu
Updated: February 8, 2020, 10:25 PM IST
సమ్మక్క, సారలమ్మ వనప్రవేశం.. ముగిసిన మేడారం జాతర...
మేడారంలో మొక్కులు చెల్లించుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్
  • Share this:
మేడారం జాతర దిగ్విజయంగా ముగిసింది. వనదేవతలు భక్తుల శరణు మధ్య వనప్రవేశం చేశారు. అంతకు ముందు గద్దెల వద్ద గిరిజన పూజారులు సంప్రదాయ పూజలు నిర్వహించారు. పూజల అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వనప్రవేశం జరిగింది. డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్లు నడుమ సమ్మక్క, సారలమ్మలు సంప్రదాయ నృత్యాల మధ్య వనప్రవేశం చేశారు. వనదేవతల వనప్రవేశం వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. నాలుగు రోజుల పాటు మేడారం జాతర అంతరంగ వైభవంగా సాగింది. జాతర విజయవంతగా ముగిసిన సందర్భంగా దర్శనం సమయంలో సహకరించిన భక్తులకు, జాతర ఏర్పాట్లు చేసిన అన్ని శాఖల సిబ్బందికి, పోలీసులు శాఖకు జిల్లా కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మేడారం జాతర నిర్వహణపై సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డిని, అన్ని శాఖల ఉద్యోగులు, పోలీసులు, అధికారులను సీఎం అభినందించారు. అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి దిగ్విజయంగా నిర్వహించారు. అన్నిశాఖల సమన్వయం వల్లే జాతర దిగ్విజయంగా జరిగింది. గతంలో ఎన్నడూలేని విధంగా ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూశారని మెచ్చుకున్నారు. ప్రభుత్వ సిబ్బందికి సహకరించిన ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
First published: February 8, 2020, 10:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading