ఫిలిం స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రానికి పాట పాడిన కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన విషయం అందరికి తెలిసిందే . తాజాగా మరోసారి మొగులయ్య తెలంగాణ ఆర్టీసీ బస్సులు ప్రయాణం సురక్షితం అంటూ పాడిన పాట కూడా ప్రజలను ఆకట్టుకుంటుంది. ఈ పాట కూడా సోషల్ మీడియాలో వైరల్ కాగా పలువురు ప్రశంసించారు. ఇటీవల తన కుమారుడి వివాహం చేసిన మొగులయ్య ఈ వేడుక కోసం ఆర్టిసి బస్సు అద్దెకు తీసుకున్నాడు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా లోని అచ్చంపేట ఆర్టీసీ డిపోల అధికారుల కోరిక మేరకు మొగులయ్య పాట పాడారు. ఆర్టీసీ బస్సులు వినియోగించుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలను పాటల ద్వారా వివరించారు.
కిన్నెర వాయిద్యంతో మొగులయ్య పాడిన పాట ప్రయాణికులకు ఎంతో ఆకట్టుకుంటుంది. ఇరవై రోజుల కిందట మొగిలయ్య తో పాట పాడించారు. ఆయన పాడిన పాట కారణంగా ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇస్తున్న విషయం ప్రజల్లోకి వెళ్ళిందన్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో నియోజకవర్గంలో 15 బస్సులు అద్దెకు తీసుకున్నారని అచ్చంపేట డిపో మేనేజర్ భాను ప్రకాష్ తెలిపారు. ఈ పాటను ఆర్టీసీ ఎండి దృష్టికి తీసుకెళ్లగా పాట బాగుందని గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించినట్లు డిపో మేనేజర్ తెలిపారు. అంతేకాక మొగులయ్య కు తెలంగాణ రాష్ట్రం అంతా ఫ్రీ సర్వీస్ అంటూ సజ్జనార్ చేతులమీదుగా ఫ్రీ బస్సు పాస్ తీసుకోవడం జరిగింది.
కూతురు వివాహానికి TSRTC బస్ బుక్ చేసుకున్న కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య గారి స్వీయ అనుభవం.@tsrtcmdoffice #Hyderabad #TeluguFilmNagar #Tollywood pic.twitter.com/BqvkpwRRxa
— Abhinay Deshpande (@iAbhinayD) November 21, 2021
మొన్నటిదాకా సంతలు తిరిగి పాటలు పాడుకుంటూ జీవనం కొనసాగిస్తున్న మొగులయ్య భీమ్లా నాయక్ సినిమా పాట తో పాటు తెలంగాణ ఆర్టీసీ పై పాడిన పాట ఏకంగా ఇతర రాష్ట్రాల లో పేరు సంపాదించుకున్నాడు. ఇలాంటి కళాకారులు తెలంగాణలో చాలా ఉన్నారు. మొన్నటిదాకా బిగ్ బాస్ సీరియల్లో గంగవ్వ ఆమె పేరు రాష్ట్రమంతటా తెలిసేవిధంగా చేశారు. అంతేకాక సినీ హీరో నాగార్జున గంగవ్వ కు ఏకంగా ఇల్లు కట్టించారు. అలాగే మొగులయ్యకు కూడా సినీ హీరో పవన్ కళ్యాణ్ ఇంటికి పిలిపించుకుని రెండు లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో ఆర్టీసీ పై పాడిన పాట చూశాక ఆర్టీసీ ఎండి సజ్జనార్ మొగులయ్య కు రాష్ట్రమంతా తిరగడానికి ఫ్రీ బస్సు పాస్ కల్పించారు.
ఆర్టీసీ అందించిన సేవలకు సంతోషం వ్యక్తం చేస్తూ అద్దెకు తీసుకున్న బస్సు ముందు తనదైన శైలిలో కిన్నెరతో పాటను ఆలపించారు మొగులయ్య. ఆర్టీసీ బస్సు తల్లిలాంటిదని కొనియాడాడు. ‘గంటలోనా బస్సు వస్తది.. ఆగవయ్య మొగులయ్యా.. డీఎం సార్కు చెప్తనేను.. ఆర్టీసీ బస్సు పంపుతా.. ఒక్క గంటలో బస్సు వచ్చే.. సుట్టాల్ పిల్లలు బస్సు ఎక్కిరి.. ఆర్టీసీ బస్సులోనా చెప్పలేని ఆనందం.. ఆర్టీసీ బస్సు ఎక్కి మంచిగ నేను పోయి వచ్చిన.. బస్సు అంటే బస్సు కాదు తల్లిలాంటి ఆర్టీసీ.. శభాష్ ఆర్టీసీ.. శభాస్ సజ్జనార్’ అంటూ సాగే పాటను ఆయన ఆలపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahabubnagar, Tsrtc