• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA KARIMNAGAR DAIRY HIKES MILK PROCUREMENT PRICE HERE IS THE DETAILS SU

Karimnagar Dairy: పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కరీంనగర్ డైయిరీ.. పాల సేకరణ ధరలు పెంపు..

Karimnagar Dairy: పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కరీంనగర్ డైయిరీ.. పాల సేకరణ ధరలు పెంపు..

ప్రతీకాత్మక చిత్రం

పాడి రైతులకు కరీంనగర్ డెయిరీ గుడ్ న్యూస్ చెప్పింది. పాల సేకరణ ధరలను పెంచుతూ కరీంనగర్ డైయిరీ యజమాన్యం నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    పాడి రైతులకు కరీంనగర్ డెయిరీ గుడ్ న్యూస్ చెప్పింది. పాల సేకరణ ధరలను పెంచుతూ కరీంనగర్ డైయిరీ యజమాన్యం నిర్ణయం తీసుకుంది. పాల సేకరణ ధరను లీటర్‌కు రూ. 2 చొప్పున పెంచనున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. లీటర్ పాలపై రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే 4 రూపాయల ప్రోత్సహకానికి అదనంగా ఉండనుంది. శుక్రవారం కరీంనగర్ డెయిరీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో Karimnagar Milk Producer Company Limited (KMPCL) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పాడి రైతులకు డెయిరీ తరఫున లీటర్‌ పాలకు రూ. 1 ప్రోత్సాహకంగా చెల్లించాలని పాలకవర్గం నిర్ణయం తీసుకున్నట్లు రాజేశ్వర్‌ రావు వెల్లడించారు.

    ఈ నిర్ణయంతో గేదె పాలు.. 6 శాతం వెన్న ఉన్న పాలు లీటర్‌కు రూ. 37.20 నుంచి రూ. 39.40కి, 7 శాతం వెన్న ఉన్న పాలు లీటర్‌కు రూ. 43.40 నుంచి రూ. 45.80కి, 10 శాతం వెన్న ఉన్న పాలు లీటర్‌కు రూ. రూ. 62 నుంచి రూ. 65కు పెరగనున్నాయి. ఇక, ఆవు పాలు.. 4 శాతం వెన్న ఉన్న పాలు లీటర్‌కు రూ. 30.63 నుంచి రూ. 33.13కు, 4.5 శాతం ఉన్న పాలు లీటర్‌కు రూ. 31.85 నుంచి రూ. 34.41కి, 5 శాతం వెన్న ఉన్న పాలు రూ. 33.08 నుంచి రూ. 35.70కి పెంచనున్నట్టుగా కరీంగన్ డెయిరీ తెలిపింది.

    మరోవైపు మార్చి 1 నుంచి పాల ధరలు పెరగనున్నాయనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్యుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పాల ధరలను పెంచాలని కొన్ని రాష్ట్రాల్లో పాల ఉత్పత్తిదారు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు