Kamareddy: అన్నదాత ఆవేదన, కామారెడ్డిలో వరి పంటకు మంట

కామారెడ్డి జిల్లా సన్నరకం వరి పంటకు తెగులు విజృంభించడంతో రోజుకో చోట రైతులు పంటను దహనం చేస్తున్నారు.

news18-telugu
Updated: October 30, 2020, 6:20 PM IST
Kamareddy: అన్నదాత ఆవేదన, కామారెడ్డిలో వరి పంటకు మంట
కామారెడ్డి జిల్లాలో వరి పంటకు మంట పెట్టిన రైతు
  • Share this:
కామారెడ్డి జిల్లా సన్నరకం వరి పంటకు తెగులు విజృంభించడంతో రోజుకో చోట రైతులు పంటను దహనం చేస్తున్నారు. చేతికొచ్చిన వరి పంట దోమపోటు సోకడంతో మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోవడం... దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షాలకు పంట నెలకొరగడంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదని ఆగ్రహించిన రైతులు పంటకు నిప్పు పెడుతున్నారు. రాజంపేట్ మండలంలోని ఎల్లారెడ్డి పల్లి తండా కు చెందిన రైతు దావత్ బాబూలాల్, ధరావత్ శ్రీనివాస్ లు చెరి రెండు ఎకరాల సన్నారకం వరి సాగు చేశారు. దోమపోటుతో గింజ కూడా రాకపోయే సరికి సన్నవరికి నిప్పంటించారు. వేల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. లింగంపేట్ మండలంలో సుమారు సన్నారకం వరి 6000 ఎకరాలలో సాగు చేయగా 2000 వేల ఎకరాలకు పైగా దోమపోటు, అగ్గి తెగులు వచ్చిందని రైతులు తెలుపగా లింగంపెట్ వ్యవసాయ అధికారి సాయి రమేష్ పంటలను పరిశీలించి కొన్ని గ్రామాలలో దోమపోటు, అగ్గి తెగలు పంటకు సోకినట్లు తెలిపారు. ఒకపక్క సన్నరకం వరికి మద్దతు ధర లేక మరోపక్క దోమపోటు, తెగుళ్లు సోకడంతో దిగుబడి రాక పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం వచ్చిన రైతులకు గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

మూడు రోజుల క్రితం నిర్మల్‌ జిల్లాలోనూ పంటకు మంట

నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండలం చామన్ పల్లికి చెందిన రైతు ఏలేటి శ్రీనివాస్ రెడ్డి తన రెండెకరాల పొలంలో సన్న రకం వరి సాగుచేశాడు. అయితే గతంలో దొడ్డు రకం వరి సాగు చేసినట్లు బాధిత రైతు శ్రీనివాస్ రెడ్డి తెలిపాడు. ఆ సమయంలో తనకు కాస్త లాభాలు వచ్చాయని వివరించాడు. ప్రభుత్వం సూచనలతో ఈ సారి అతను సన్న రకం వరి సాగు చేశాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటపొలంలో వర్షం నీరు నిలిచింది. దీంతో పంట దోమపోటుకు గురై ఎండిపోయింది. దీంతో తీవ్రంగా నష్ట వస్తుందని రైతు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆ ఆవేదనతో ఎండిపోయిన వరి పంటకు నిప్పు పెట్టాడు. ప్రభుత్వం సహాయం చేసి తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.

ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలు తీసుకువస్తున్నా.. ఎన్ని పథకాలు ప్రవేశపెడుతున్నా.. అన్నదాతల బతుకులు మాత్రం మారడం లేదు. వారి కష్టాలు ఏ మాత్రం తీరడం లేదు. ఏటా.. ఏదో విధంగా రైతులు నష్టపోతూనే ఉన్నారు. వర్షాలు లేక కొన్ని సార్లు, వర్షాలు ఎక్కువై మరి కొన్ని సార్లు పంట దెబ్బతిని పెట్టుబడులు కూడా పోగొట్టుకుంటున్నారు. కంటి రెప్పలా కాపాడుకున్న వరి పంట ఎండి పోవడంతో ఓ అన్నదాత పంటకు అగ్గి పెట్టిన విషాద కథ ఇది. తీవ్ర నష్టం వాటిల్లడంతో ఏమి చేయాలో తెలియక ఆవేదన చెందిన రైతులు చివరకు తాము పెంచిన పంటకు తామే నిప్పుపెడుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికి ఇది రెండో ఘటన. బయటకు రాని ఘటనలు ఇంకా చాలా ఉంటాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 30, 2020, 5:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading