• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA JUNIOR DOCTORS ASSOCIATION HAS CALLED FOR A BOYCOTT LETTER POSTED ON TWITTER TO KTR VRY

Ktr Twitter : జూనియర్ వైద్యుల అల్టిమేటమ్..కావాల్సింది పూలు ,చప్పట్లు కాదు. జీతం ,జీవితం

Ktr Twitter : జూనియర్ వైద్యుల అల్టిమేటమ్..కావాల్సింది పూలు ,చప్పట్లు కాదు. జీతం ,జీవితం

ఎన్‌ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ విజయవాడలో మెడికల్ విద్యార్థుల ధర్నా

Ktr Twitter : రెండు వారాల్లోగా తమ డిమాండ్స్ నెరవేర్చక పోతే విధులను బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్ల సంఘం హెచ్చరించింది. దీంతోపాటు వైద్యులకు కావల్సింది చప్పట్లు, పూలు కాదు, గౌరవప్రదమైన జీతం మరియు జీవితం కావాలంటూ జూనియర్ డాక్టర్ల సంఘం తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్‌కు లేఖ రాశాయి. కాగా ఈ లేఖను మంత్రి కేటిఆర్ ట్విట్టర్ ఖాతాకు పోస్ట్ చేస్తూ..సీఎం కేసిఆర్‌ను ట్యాగ్ చేశారు.

  • Share this:
గత కొద్ది రోజులుగా జూనియర్ డాక్టర్స్ తమ డిమాండ్స్ సాధన కోసం ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే గురువారం మంత్రి కేటిఆర్ నిర్వహించిన ఆస్క్ కేటిఆర్ కార్యక్రమంలో ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వార ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంధర్భంగా వారికి సంబంధించిన డిమాండ్స్ పై స్పందించాలని లేదంటే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. అయితే జూనియర్ డాక్టర్స్ డిమాండ్స్‌ను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకువెళతానని హమి ఇచ్చారు.

ఇక జూనియర్ డాక్టర్స్..డిమాండ్స్‌కు సంబంధించిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. వాటిలో ముఖ్యంగా జూనియర్ డాక్టర్స్ 15 శాతం వేతన పెంపు గత సంవత్సరం నుండి పెండింగ్‌‌లో ఉందని పేర్కోన్నారు.దీంతో పాటు వైద్యులకు 10 శాతం ప్రోత్సహాకాలను ప్రభుత్వం ప్రకటించిన అవి ఇప్పటివరకు ఇవ్వడం లేదని తెలిపారు. ఇక కోవిడ్ వార్డులో పనిచేసిన చనిపోయిన వైద్యులకు 50 లక్షలు, నర్సులు, సహాయక సిబ్బందికి 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.ఇక నిమ్స్‌లో హెచ్‌సిడబ్ల్యు మరియు వారి కుటుంబాలకు ఉచిత చికిత్స మరియు పిజిల వరకు వైద్య విద్యార్థులకు అందరికి బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

పైన పేర్కోన్న డిమాండ్లపై సంభందిత అధికారులతో గత ఆరునెలలుగా చర్చిస్తున్నప్పటికి ఎలాంటీ స్పందన రావడం లేదని పేర్కోన్నారు. ఇక ముఖ్యమంత్రి కేసిఆర్ సైతం వైద్యుల అభ్యున్నతికి పాటుపడతామని ఇచ్చిన హామిలు కూడ అమలు కావడం లేదని లేఖలో పేర్కోన్నారు.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు