కాళేశ్వరం ప్రాజెక్టుపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు...

కేసీఆర్ మాట తప్పారని, ఇప్పటికి సరి చేసుకొనే అవకాశం ఉందని అన్నారు. జిల్లా ప్రజల నోరు కొట్టి ఇక్కడి నీటిని తీసుకుపోతే ప్రజలు సహించరని, వారితో కలిసి ఉద్యమిస్తామని కోదండరాం అన్నారు.

news18-telugu
Updated: August 24, 2019, 10:55 PM IST
కాళేశ్వరం ప్రాజెక్టుపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు...
కోదండరాం (ఫైల్ ఫొటో)
  • Share this:
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే ప్రభుత్వానికి పెట్టుబడి ఖర్చు, నిర్వహణ వ్యయం తక్కువ అయ్యేదని తెలంగాణా జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈ రోజు పార్టీ ప్రతినిధి బృందం తో కలిసి తుమ్మిడిహెట్టి సందర్శించారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. పాల్వాయి హరీష్ కూడా సందర్శించారు. ఈ సందర్భంగా కాలేశ్వరం ప్రాజెక్ట్ ఖర్చు తో కూడుకున్నదని, దీని పూర్తికి లక్ష కోట్ల వరకు కూడా పట్టవచ్చని అభిప్రాయ పడ్డారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ కడితే జిల్లా ప్రజల తాగు నీటి అవసరాలు, సాగు నీటి సౌకర్యం తీరేదని, తర్వాత ఇక్కడి నుండి ఎల్లంపల్లి కి, అక్కడి నుండి దిగువకు తక్కువ ఖర్చుతో ఎత్తిపోయవచ్చన్నారు. కేసీఆర్ మాట తప్పారని, ఇప్పటికి సరి చేసుకొనే అవకాశం ఉందని అన్నారు. జిల్లా ప్రజల నోరు కొట్టి ఇక్కడి నీటిని తీసుకుపోతే ప్రజలు సహించరని, వారితో కలిసి ఉద్యమిస్తామని కోదండరాం అన్నారు.

First published: August 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు