Home /News /telangana /

హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి యూత్ లీడర్స్ కాన్ఫరెన్స్..ముఖ్యఅతిథిగా హజారే

హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి యూత్ లీడర్స్ కాన్ఫరెన్స్..ముఖ్యఅతిథిగా హజారే

తెలంగాణ జాగృతి

తెలంగాణ జాగృతి

గాంధేయమార్గంలో సుస్థిర అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు ఇతివృత్తంగా యూత్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ జరగనుంది. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అహింసామార్గంలో ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వ్యక్తలు ప్రసంగించనున్నారు.

    హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు ఎంపీ కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి శ్రీకారం చుట్టింది. ఈ నెల 19, 20న నావాటెల్ కన్వెన్షనల్ సెంటర్‌లో తెలంగాణ జాగృతి ఇంటర్నేషనల్ యూత్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ TJIYLC-2019 జరగబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల నుంచి 500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. యూత్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్‌కు సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 19న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత ప్రారంభోపన్యాసం చేస్తారు. 20వ జ‌రిగే ముగింపు స‌మావేశానికి గ‌వ‌ర్న‌ర్ ఇ.ఎస్‌.ఎల్ న‌ర‌సింహ‌న్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతారు. స‌ద‌స్సులో పాల్గొనాల‌్సిందిగా శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను ఆహ్వానించారు ఎంపీ కవిత.

    TJIYLC-2019, TJIYLC registration, TJIYLC-2019 dates, Telangana Jagruthi, mp kavitha jagruthi, తెలంగాణ జాగృతి, యూత్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్
    గవర్నర్ నరసింహన్‌ను సదస్సుకు ఆహ్వానించిన ఎంపీ కవిత


    గాంధేయమార్గంలో సుస్థిర అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు ఇతివృత్తంగా యూత్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ జరగనుంది. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అహింసామార్గంలో ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వ్యక్తలు ప్రసంగించనున్నారు. పర్యావరణ కాలుష్యం, సముద్ర జీవరాశుల పరిరక్షణ, పేదరికం, మానవహక్కులను కాపాడటం, లింగవివక్షను రూపుమాపడం, భౌతిక వనరుల కాపాడటం వంటి 20 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సదస్సులో చర్చించనున్నారు. వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం, వాటిని భవిష్యత్‌తరాలకు అందించడం, నూతన ఆవిష్కరణలపైనా ఇందులో చర్చ జరుగుతుంది.

    మొద‌టి రోజు యువ‌త అభివృధ్ధి పై ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ శేఖ‌ర్ గుప్తా చ‌ర్చా గోష్టిని నిర్వ‌హిస్తారు. ప‌ది వేర్వేరు హాళ్ల‌లో వేర్వేరు అంశాల‌పై చ‌ర్చా గోష్టులు జ‌రుగుతాయి. ప్రప‌ంచ ప్ర‌గ‌తిలో యువ‌త పాత్ర‌పైనా యువ నాయ‌కులు మాట్లాడ‌తారు. రెండో రోజు నైపుణ్య శిక్ష‌ణ‌, స‌మ‌తులాభివృద్ధిలో యువ‌త‌, మ‌హిళ‌ల పాత్ర‌, కార్పోరేటు,ప్ర‌భుత్వాల భాగ‌స్వామ్యం పై చ‌ర్చిస్తారు. వీటిని అంత‌ర్జాతీయంగా ఆయా రంగాల్లో నిష్టాతులు నిర్వ‌హిస్తారు. 2030 వ‌ర‌కు భ‌విష్య‌త్ మాన‌వాళి మ‌నుగ‌డ‌కు అవ‌స‌ర‌మైన ప్రాథ‌మిక ల‌క్ష్యాల‌ను సాధించేందుకు ఐక్య‌రాజ్య స‌మితి విడుల చేసిన 17 అంశాల ల‌క్ష్యాల సాధ‌న‌లో భాగంగా తెలంగాణ జాగృతి ఈ అంత‌ర్జాతీయ స‌ద‌స్సు ను నిర్వ‌హిస్తున్న‌ద‌ని కవత తెలిపారు.

    తెలంగాణ జాగృతి 2008 నవంబర్ 3న ఏర్పాటైంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. వీటితో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువత, మహిళలు, రైతుల కోసం అనేక కార్యక్రమాలను చేపడుతోంది జాగృతి సంస్థ. బతుకమ్మ పండగకు ప్రపంచ గుర్తింపు తీసుకురావడంలో జాగృతి కీలక పాత్ర పోషించిందని ఎంపీ కవతి పలు సందర్భాల్లో చెప్పారు. ఇక తాజాగా ప్రపంచ సమస్యలు, సవాళ్లపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. సమాజ నిర్మాణంలో యువత పోషించాల్సిన పాత్రపై TJIYLC-2019 చర్చించనున్నారు.
    First published:

    Tags: MP Kavitha, Telangana

    తదుపరి వార్తలు