‘అర్జున్ రెడ్డి’ ఇంట్లో కేటీఆర్!

ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ... ప్లాస్టిక్ వాడకం మానేయమంటూ విజయ్‌కి సలహా చెప్పిన కేటీఆర్!

news18-telugu
Updated: June 25, 2018, 12:40 PM IST
‘అర్జున్ రెడ్డి’ ఇంట్లో కేటీఆర్!
విజయ్ దేవరకొండ కుటుంబంతో మంత్రి కేటీఆర్
  • Share this:
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ సెన్సెషనల్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ వంటి సీనియర్ స్టార్లు, బాహుబలి ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ వంటి స్టార్ హీరోలు నామినేషన్లలో ఉన్నా, ఫిలింఫేర్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యి, సంచలనమే క్రియేట్ చేశాడు విజయ్.

అలా తనకు వచ్చిన మొట్టమొదటి ప్రతిష్టాత్మక అవార్డు వేలం వేయాలనే ఆలోచనను ట్వీట్టర్ వేదికగా ప్రకటించాడు విజయ్. కేటీఆర్‌ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలనుకుంటున్నట్టు పోస్ట్ చేశాడు. విజయ్ ట్వీట్‌కి కేటీఆర్... అలాగే చేద్దామంటూ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ ఇంటికెళ్లారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.


తన కుటుంబంతో కలిసి కేటీఆర్ ఉన్న ఫోటోను పోస్టు చేసిన విజయ్ దేవరకొండ... ‘‘మీకెంతో ఇష్టమైన లీడర్, మీ ఇంటికి లంచ్‌కి వస్తే? ఒక్క సెకన్... అసలు ఏం జరుగుతోంది బాస్... బేసికల్లీ ఏమైనా జరగొచ్చు. మనకి నచ్చింది మనం చేస్తూ పోవాలంటే...’’ అంటూ కామెంట్ పెట్టాడు. ఆ తర్వాత తన ఇంటి బాల్కనీ ద్వారా కేటీఆర్‌కి బయటేదో చూపిస్తూ దిగిన ఫోటో పోస్ట్ చేసిన విజయ్... ‘‘నా ఫిల్మింఫేర్ అవార్డు చూపించా. వేలానికి ఇచ్చేశా... నా రౌడీస్ (ఫ్యాన్స్) గురించి చెప్పాను. ఆయన మాకు చేనేత, నీటి పొదుపు, హైదరబాద్ రోడ్లు...ఇలా ఎన్నో విషయాలు చెప్పారు. ప్లాస్టిక్ వాడకం మానేయ్యమంటూ సలహా ఇచ్చారు...డ్రీమ్ బిగ్ రౌడీస్’’ అంటూ పోస్టు చేశాడు విజయ్ దేవరకొండ.

Published by: Ramu Chinthakindhi
First published: June 25, 2018, 12:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading