Home /News /telangana /

TELANGANA IS NO LONGER A GOVERNMENT ORDER TO USE THOSE NAMES BN

తెలంగాణలో ఇక నుంచి ఆ పేర్లు ఉండవ్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

తెలంగాణ సీఎం కేసీఆర్ (File)

తెలంగాణ సీఎం కేసీఆర్ (File)

ఖరీఫ్, రబీ పేర్లకు బదులుగా వానాకాలం, యాసంగిగా మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నింజన్ రెడ్డి ఆమోదం మేరకు వ్యవసాయ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది.

    తెలంగాణలో వ్యవసాయ సీజన్లకు సంబంధించి ఖరీఫ్, రబీ పేర్లతో పిలుస్తుంటారు. అయితే ఈ పేర్లపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆ పేర్లకు బదులుగా వానాకాలం, యాసంగిగా మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నింజన్ రెడ్డి ఆమోదం మేరకు వ్యవసాయ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వ్యవసాయ సీజన్ల పేరు ఉండాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా సామాన్యులకే కాకుండా చదువుకున్న వారికి సైతం ఖరీఫ్, రబీ పదాల్లో స్పష్టత ఉండేది కాదు. ఇకనుంచి శాఖాపరమైన ఉత్తర్వులు, పత్రాల్లో వానాకాలం, యాసంగి పదాలనే వినియోగించనున్నారు. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, వ్యవసాయ శాఖ కార్యాలయానికి ఈ మేరకు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Agriculture, CM KCR, Telangana

    తదుపరి వార్తలు