water dispute : ఓవైపు మంత్రులు.... మరోవైపు అధికారులు..బోర్డుపై పెరుగుతున్న ఒత్తిడి

water dispute : ఓవైపు మంత్రులు.... మరోవైపు అధికారులు..బోర్డుపై పెరుగుతున్న ఒత్తిడి

water dispute : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నది ప్రాజెక్టుల వివాదంపై మంత్రులు మాటల యుద్దం కొనసాగిస్తుంటే...మరోవైపు అధికారులు సైతం చట్టపరంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం ఎడమ కాలువ విద్యుత్ కేంద్రాన్ని ఆపాలన్న కేఆర్ఎంబీ నిర్ణయాంపై తెలంగాణ నీటిపారుదల శాఖ స్పందించింది. చట్టానికి లోబడే విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని లేఖలో స్పష్టం చేసింది.

  • Share this:
    కృష్ణా నది ప్రాజెక్టుల వివాదం..చివరకు విద్యుత్ ప్రాజెక్టులపై పడిన విషయం తెలిసిందే..రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే ,ఏపి ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగానే వ్యవహరించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిపై ఫోకస్ పెట్టింది. శ్రీశైలం 834 అడుగుల మేర నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ వినియోగించుకోవాలనే నిబంధనతో కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. దీంతో కేఆర్ఎంబీ సైతం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

    దీంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదిరింది. అయితే బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ విద్యుత్ అధికారులు లేఖ రాశారు. లేఖలో ముఖ్యంగా రాష్ట్రానికి చట్టపరంగా హక్కుగా ఇచ్చిన వాటాతోనే విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నామని లేఖలో స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్​కు ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు ఛైర్మన్​కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు.

    శ్రీశైలం ప్రాజెక్టు ప్రధానంగా జలవిద్యుత్ ప్రాజెక్టు అని లేఖలో పేర్కోన్నారు, కృష్ణా జలాల మొదటి ట్రైబ్యునల్ ప్రకారం.. శ్రీశైలం జలాలను ఇతర బేసిన్‌లకు తరలించే హక్కు ఏపి లేదని పేర్కోన్నారు.ఇక గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఏపి వరకు ఏప్రిల్, మే నెలల్లో శ్రీశైలంలో 834 అడుగుల పైన నీటి మట్టం ఉండేలా ఏపీ చూడలేదని... ఇప్పుడు మాత్రం బేసిన్ వెలుపలకు నీటిని తరలించాలని 854 అడుగుల పైన నీటి మట్టం ఉండాలని అంటుందని వివరించారు. కృష్ణా డెల్టా అవసరాల కోసం 760 అడుగుల వరకు కూడా నీటిని వదిలేలా 2013లో ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసిందని గుర్తు చేశారు. గత రెండేళ్లుగా 170, 124 టీఎంసీల నీటిని తరలించిన ఆంధ్రప్రదేశ్... చెన్నై తానీటి కోసం కనీసం 10 టీఎంసీలు కూడా సరఫరా చేయలేదని తెలిపారు. 2020-21లో ఏపీ ఏకంగా 629 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకొందన్న ఈఎన్సీ... జూన్ పదో తేదీ నాటికి ఏపీలోని పెన్నా బేసిన్ జలాశయాల్లో 95 టీఎంసీల నీరు, మొత్తంగా పెన్నా సహా ఇతర బేసిన్లలో 360 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని వివరించారు.

    ఇక తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వార నష్టం జరుగుతుందని ఆధారాలు లేకుండా వాదిస్తుందని అన్నారు. 50 శాతం నిష్పత్తిలో విద్యుత్ పంపకాలు చేయాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని, ముందు చేసుకున్న అవగాహన కేవలం ఆ ఏడాదికి మాత్రమే వర్తిస్తుందని ఈఎన్సీ తెలిపారు. ప్రణాళికా సంఘం నివేదిక, కృష్ణా మొదటి ట్రైబ్యునల్ తీర్పునకు లోబడే సాగర్​లో క్యారీ ఓవర్ స్టోరేజ్ ఉండేలా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని వివరించారు. శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి వల్ల తాగునీరు, గునీటి ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న ఏపీ వాదనల్లో నిజం లేదని వివరించారు.... ఎలాంటి ఆధారాలు లేకుండానే బోర్డును తప్పుదోవ పట్టిస్తున్నారని లేఖలో వివరించారు. తెలంగాణ తన వాటా నీటిని అవసరాల మేరకు ఉపయోగించుకుంటుందని... వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఒక నిర్ణయానికి రావాలని బోర్డు చైర్మన్‌ను కోరారు.
    Published by:yveerash yveerash
    First published: