మురికి కాలువ విషయంలో గొడవ.. ప్రభుత్వ ఉద్యోగిని బండరాయితో కొట్టి చంపేశాడు..

ప్రతీకాత్మక చిత్రం

కుచులాపూర్ గ్రామానికి చెందిన రాగి ఉత్తమ్ అనే వ్యక్తి నీటి పారుదల శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో భోజనం చేసిన అనంతరం ఇంటి నుంచి కాలక్షేపానికి బయటకు వచ్చారు.

  • Share this:
    మురికి కాలువ విషయంలో జరిగిన గొడవ హత్యకు దారితీసింది. ప్రభుత్వ ఉద్యోగిని బండరాయితో మోది హత్యచేశాడో దుండగుడు. పాత కక్షలతో అతడిని దారుణంగా చంపేశాడు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచులాపూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్ రూరల్ సీఐ పురుషోత్తమాచారి, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కుచులాపూర్ గ్రామానికి చెందిన రాగి ఉత్తమ్ అనే వ్యక్తి నీటి పారుదల శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో భోజనం చేసిన అనంతరం ఇంటి నుంచి కాలక్షేపానికి బయటకు వచ్చారు. ఐతే గ్రామానికి చెందిన మడావి సుధాకర్ అనే వ్యక్తితో ఉత్తమ్‌కు గత కొంత కాలంగా పొసగడం లేదు. మురికి కాలువ నిర్మాణ విషయంమై ఇరుకుటుంబాల నడుమ వైరం కొనసాగుతోంది.

    ఈ క్రమంలో ఉత్తమ్‌పై కక్ష పెంచుకున్న సుధాకర్ .. పథకం ప్రకారం రాత్రి ఎవరూ లేని సమయంలో బండరాయితో కొట్టి హతమార్చినట్లు సీఐ పురుషోత్తమ చారి తెలిపారు. రూరల్ సీఐ పురుషోత్తమాచారి, తలమడుగు ఎస్ఈ దివ్య భారతి ఆదివారం ఘటనా స్థలాన్ని సందర్శించి పంచనామ నిర్వహించారు. మృతుడి భార్య రాగి చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ తెలిపారు. మృతుడిని హతమార్చిన తర్వాత నిందితుడు భయంతో రాత్రంతా తన చేనులో తలదాచుకున్నాడని, అదుపులోకి తీసుకుని విచారించినట్లు పేర్కొన్నారు. శిక్షణా ఎస్ఐ ప్రవళికతో కలిసి తలమడుగు పోలీస్ స్టేషన్లో నిందితుడిని ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: