IPS Chandana Deepthi : తెలంగాణ ఐపీఎస్ అధికారిణికి జగన్ బంధువుతో పెళ్లి..!

IPS Chandana Deepthi : చందన చేసుకోబోయే వ్యక్తి జగన్‌కి స్వయానా బంధువు కావటంతో రాజకీయవర్గాల్లోనూ ఈ పెళ్లి పట్ల చాలా ఆసక్తి నెలకొంది. అందం, పనితీరుతో ఇప్పటికే చాలామంది ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎస్పీ చందనకు పెళ్లి అని తెలియగానే తెలంగాణలోని కొందరు యువత అతనెవరో తెలుసుకునే పనిలో పడ్డారట.

news18-telugu
Updated: July 24, 2019, 5:59 PM IST
IPS Chandana Deepthi : తెలంగాణ ఐపీఎస్ అధికారిణికి జగన్ బంధువుతో పెళ్లి..!
ఐపీఎస్ దీప్తి చందన
  • Share this:
చందన దీప్తి.. మెదక్ ఎస్పీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి
వార్తల్లో నిలిచారు. తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని.. అయితే తనకు ఇప్పటికే పెళ్లయిందని ఇంటర్నెట్‌లో గాలివార్తలు హల్‌చల్ చేయడం వల్లే తనకు కాబోయేవాడు ఇంతవరకు తనను కలవలేకపోయాడని సరదా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. పెళ్లి గురించి ఇలా కామెంట్స్ చేసిన కొద్దిరోజులకే
దీప్తి చందనకు పెళ్లి కుదిరినట్టుగా వార్తలు వస్తుండటం గమనార్హం. అయితే ఈసారి మాత్రం ఇదేదో గాలివార్త అని కొట్టిపారేయడానికి లేదట.ఎందుకంటే.. ఏపీ ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరి బంధువైన వ్యక్తితోనే ఆమె వివాహం నిశ్చయమైందట.త్వరలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారట. ఇంట్లో పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారం. చందన చేసుకోబోయే వ్యక్తి జగన్‌కి స్వయానా బంధువు కావటంతో రాజకీయవర్గాల్లోనూ ఈ పెళ్లి పట్ల చాలా ఆసక్తి నెలకొంది. అందం, పనితీరుతో ఇప్పటికే చాలామంది ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎస్పీ చందనకు పెళ్లి అని తెలియగానే తెలంగాణలోని కొందరు యువత అతనెవరో తెలుసుకునే పనిలో పడ్డారట. ఏది ఏమైనా మెదక్ ఎస్పీకి కాబోయే వరుడు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించి స్వదేశానికి వచ్చి రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో స్థిరపడ్డట్టు కొందరి భోగట్టా!! త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారని తెలుస్తోంది.

First published: July 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>