రేపే తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

ఈ నెల 14న ఫలితాలు ఇస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఇప్పుడే చెప్పారని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

news18-telugu
Updated: July 13, 2019, 9:08 AM IST
రేపే తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు ఈ నెల 14వ తేదీన అంటే రేపే రానున్నాయి. ఈ విషయాన్ని టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ శుక్రవారం రాత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు. 15వ తేదీలోపు ఇంటర్‌ ధ్రువపత్రాలు సమర్పించాలన్న షరతుపై పలువురు తెలంగాణ విద్యార్థులకు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు సీట్లు ఇచ్చాయన్నారు. అయితే ఇప్పటివరకు ఇంటర్‌ ఫలితాలు రాకపోవడంతో సీట్లు కోల్పోతారని అంతా ఆందోళన చెందుతున్నారని ఓ విద్యార్థి తల్లి కేటీఆర్‌కు ట్విటర్‌లో విన్నవించారు. దీనికి స్పందించిన కేటీఆర్ ఫలితాల వెల్లడిపై విద్యాశాఖ మంత్రి, కార్యదర్శితో మాట్లాడతానని హామీ ఇచ్చారు

అలా ట్వీట్ పెట్టిన కాసేపటికే... ఈ నెల 14న ఫలితాలు ఇస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఇప్పుడే చెప్పారని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఫలితాలను మొదట శనివారం ఇవ్వాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించినా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సూచనల మేరకు జేఎన్‌టీయూహెచ్‌ నిపుణుల పర్యవేక్షణలో తనిఖీ చేయిస్తున్నారు. దీంతో ఫలితాల తేదీని 14కు మార్చారు.

అయితే తెలంగాణ ఇంటర్ ఫలితాల నేపథ్యంలో గందరగోళం నెలకొంది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సప్లిమెంటరీ ఫలితాల విషయంలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు విద్యాశాఖ అధికారులు మాత్రం మీడియాకు ఫలితాల తేదీపై సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.
First published: July 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading