Home /News /telangana /

TELANGANA INTER STUDENT TWEETED MINISTER KTR THAT HE WAS GOING TO COMMIT SUICIDE AFTER FAILED IN RECENT RESULTS NS

Student Suicide-Minister KTR: చనిపోతున్నానంటూ మంత్రి కేటీఆర్ కు ఇంటర్ విద్యార్థి ట్వీట్.. ఫెయిల్ చేశారని ఆవేదన.. రంగంలోకి పోలీసులు

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో)

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో)

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను (TS Inter First Year Results) ఈ రోజు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఫెయిలయిన ఓ విద్యార్థి తాను ఆత్మహత్య చేసుకోబుతన్నట్లు మంత్రి కేటీఆర్ (Minister KTR) కు ట్వీట్ చేయడం కలకలం సృష్టిస్తోంది.

    తెలంగాణ ఇంటర్ ఫలితాలను (TS Inter Results) కొద్ది గంటల క్రితం ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. అయితే ఈ సారి కేవలం 49 శాతం మంది మాత్రమే పాస్ అవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో గత మార్చిలో పరీక్షలు (TS Inter Exams) లేకుండానే విద్యార్థులను సెకండియర్ లోకి ప్రమోట్ చేసింది ప్రభుత్వం. అయితే కరోనా (Corona) తగ్గిందన్న కారణంతో ఇంటర్ బోర్డు ఇటీవల ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ను నిర్వహించింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆ సమయంలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. కరోనా నేపథ్యంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల కారణంగా పరీక్షలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితా ఇంటర్ బోర్డు ఆ డిమాండ్లను పట్టించుకోకుండా పరీక్షలను నిర్వహించింది. అయితే.. అంతా ఊహించినట్లుగానే ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోయింది. కేవలం 49 శాతం మంది మాత్రమే పాస్ అవ్వడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. దీంతో ఫెయిలయిన విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

    తాజాగా.. ఫెయిలయిన ఓ విద్యార్థి తాను చనిపోతున్నానంటూ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి ట్వీట్ ద్వారా తెలపడం సంచలనం సృష్టిచింది. ఏమి రాసినా పాస్ చేస్తా అని అందరినీ ఫెయిల్ చేశారంటూ ఆ విద్యార్థి తన ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు.  తాను నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారని, దీంతో తాను ఇప్పుడు సూసైడ్ చేసుకోవబుతున్నట్లు తెలిపాడు. తన సూసైడ్ కు తెలంగాణ ప్రభుత్వమే కారణం అని ట్వీట్ లో పేర్కొన్నాడు. తన మార్కుల మెమోను కూడా ట్వీట్ కు జత చేశాడు. దీంతో హైదరాబాద్ సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ విద్యార్థిని గుర్తించేందుకు పోలీసులు గాలిస్తున్నారు. సదరు విద్యార్థి కొద్ది సేపటి తర్వాత ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. అప్పటికే ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    TS Inter Results 2021: ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో భారీగా తగ్గిన పాస్ పర్సంటేజ్.. ఫెయిలైన వారిని పాస్ చేస్తారా?

    ఫొటో: ట్విట్టర్


    అయితే.. విద్యార్థులు ఒక వేళ ఫెయిల్ అయినా కూడా వారికి కనీస మార్కులను కేటాయించి పాస్ చేయాలని తల్లిదండ్రులు గతంలో డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు భయపడినట్లు గానే పాస్ శాతం అత్యంత తక్కువగా కేవలం 49 శాతం మాత్రమే నమోదైంది. దీంతో ఫెయిల్ అయిన విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై ఇంటర్ బోర్డు, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Minister ktr, Student suicide, Telangana Inter Results

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు