Telangana : తెలంగాణ ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ హాల్‌టికెట్లు విడుద‌ల‌.. డౌన్‌లోడ్ వివ‌రాలు

ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌ హాల్‌టికెట్లు

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (Telangana State Board of Intermediate Education) TS ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి వివ‌రాలు తెలుసుకోండి.

  • Share this:
    తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (Telangana State Board of Intermediate Education) TS ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఇంతకుముందు పరీక్షలు లేకుండా పదోన్నతి పొందిన విద్యార్థులు ఇప్పుడు అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 2, 2021 వరకు జరిగే రాత పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంద‌ని బోర్డు తెలిపింది. తెలంగాణ‌ ఇంటర్ హాల్ టికెట్‌ను అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TSBIE సిలబస్‌ని 30 శాతం తగ్గించింది కాబట్టి సిలబ (Syllabus)లో 70 శాతం ప్రకారం పరీక్షలు జరుగుతాయ‌ని బోర్డు తెలిపింది. ఇంట‌ర్ పరీక్షలు (Inter Exams) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయి. పరీక్షలకు హాజరయ్యేటప్పుడు విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను తప్పనిసరిగా తీసుకురావాల‌ని బోర్డు స్ప‌ష్టం చేసింది.

    డౌన్‌లోడ్ చేసుకొనే విధానం..

    Step 1 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ ను సంద‌ర్శించాలి.

    Step 2 :  అనంత‌రం TSBIE IPE 2021 First Year Hall Tickets లింక్ పై క్లిక్ చేయాలి.

    Step 3 :  క్లిక్ చేయ‌గానే https://tsbieht.cgg.gov.in/IPE2021FirstYrHallTickets.do లింక్ ఓపెన్ అవుతుంది.

    Step 4 :  అవ‌స‌ర‌మైన డీటైన‌ల్స్ న‌మోదు చేసి స‌బ్‌మిట్ కొట్టాలి

    Step 5 :  హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.

    SSC Recruitment 2021 : ప‌ది, ఇంట‌ర్ విద్యార్థుల‌కు మంచి అవ‌కాశం.. ఎస్ఎస్‌సీలో 1,775 పోస్టులు


    అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోగానే ఏం చేయాలి..
    విద్యార్థులు అడ్మిట్ కార్డు (Admit Cards) డౌన్‌లోడ్ చేసుకొని ముందుగా పూర్తిగా వ్య‌క్తిగ‌త వివ‌రాలు స‌రిచూసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, పాఠ‌శాల పేరు, స‌బ్జెక్టుల వివ‌రాలు స‌రిగా ఉన్నాయో లేదు చూసుకోవాలి. అక్ష‌ర దోషాలు ఉంటే గుర్తించాలి. వివ‌రాలు అన్ని స‌రిగ్గా ఉన్నాయ‌ని నిర్ధారించుకోవాలి. లేకుంటే త‌ప్పిదాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లాలి.

    ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌..
    ప్ర‌స్తుతం ఉన్న కోవిడ్ నిబంధ‌న‌ల‌ (Covid 19 Protocal)కు మ‌ధ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష సెంట‌ర్ వ‌ద్ద క‌చ్చితంగా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తారు. అందుకు విద్యార్థులు మాన‌సికంగా సిద్ధంగా ఉండాలి. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎలా వెళ్లాలో చూసుకొని ఆవిధంగానే ప‌రీక్ష‌కు వెళ్లాలి. మాస్కులు త‌ప్ప‌ని స‌రిగా ధ‌రించాల్సి ఉంటుంది.

    సెల‌బ‌స్ త‌గ్గించే యోచ‌న‌లో బోర్డు..
    తెలంగాణ‌లో ఇంట‌ర్ అర్ధ‌సంవ‌త్స‌ర ప‌రీక్ష‌లు ఇంటర్ విద్యార్థులకు అర్ధ సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 13, 2021 నుంచి డిసెంబర్ 18, 2021 మధ్య జరుగుతాయి, అయితే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 2022 చివరి వారంలో జరుగుతాయ‌ని బోర్డు తెలిపింది. బోర్డ్ ఎగ్జామ్స్ 2022 కోసం కూడా, TSBIE 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన సిలబస్‌ని తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ సూచనను అమలు చేసే అవకాశం ఉంది. ప్ర‌స్తుత తరగతి 12 సిలబస్‌ని 30 శాతం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం TSBIE కి సూచించింది.
    Published by:Sharath Chandra
    First published: