హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Inter exams: తేదీల్లో మార్పు -Huzurabad ఉపఎన్నిక వల్ల రీషెడ్యూల్ -ఆ రెడు పరీక్షలు..

Telangana Inter exams: తేదీల్లో మార్పు -Huzurabad ఉపఎన్నిక వల్ల రీషెడ్యూల్ -ఆ రెడు పరీక్షలు..

ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్

ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్

Telangana Inter exams rescheduled | తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల తేదీలను సవరించినట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు తెలిపింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజవకర్గంలో ఉప ఎన్నిక కారణంగానే పరీక్షలను రీషెడ్యూల్ చేశామన్న బోర్డు.. సవరించిన తేదీలను శుక్రవారం వెల్లడించింది.

ఇంకా చదవండి ...

తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల తేదీలను సవరించినట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు తెలిపింది.  హుజూరాబాద్ అసెంబ్లీ నియోజవకర్గంలో ఉప ఎన్నిక కారణంగానే పరీక్షలను రీషెడ్యూల్ చేశామన్న బోర్డు.. సవరించిన తేదీలను శుక్రవారం వెల్లడించింది. ఈనెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానుండగా, షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న ముగుస్తాయి. రీషెడ్యూల్ లో రెండు పరీక్షల తేదీలను మార్చారు.

ఈ నెల 25 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు యథాతథంగా మొదలవుతాయని, అయితే, 29, 30 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను ఉప ఎన్నిక నేపథ్యంలో వాయిదా వేశామని బోర్డు తెలిపింది. రీషెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్‌ 29న జరగాల్సిన పరీక్షలను అక్టోబర్‌ 31న నిర్వహిస్తారు. అలాగే, అక్టోరబ్ 30న జరగాల్సిన పరీక్షలను నవంబర్‌ 1న పెడతారు. మారిన షెడ్యూల్ ప్రకారం తేదీల వారీగా ఆయా రోజుల్లో జరిగే పరీక్షల వివరాలివి..

ఈ నెల 25న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, 26న ఇంగ్లీష్‌ పేపర్‌-1, 27న మాథ్స్‌ పేపర్‌-1ఏ, బోటని పేపర్‌-1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1, 28న మ్యాథ్స్‌ పేపర్‌-1బీ, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1, 31న ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1, నవంబర్‌ 1న కెమిస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1, నవంబర్‌ 2న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1 పరీక్షలు జరుగుతాయి. కాగా,

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపధ్యంలో ఈ నెల 30వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే, ఈ సెలవు ఆ నియోజకవర్గ పరిధిలోని వారికి మాత్రమే వస్తిస్తుందని, నెగోషియబుల్ ఇన్ స్ర్టుమెంటల్ యాక్ట్1881 ప్రకారం పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. శుక్రవారం నాటికి హుజురాబాద్‌ ఉప ఎన్నికలో నామినేషన్ల సమర్పణ ప్రక్రియ ముగిసింది.

ఇప్పటివకు అందిన సమాచారం ప్రకారం హుజూరాబాద్ స్థానంలో 26 నామినేషన్లు దాఖలయ్యాయి. కచ్చితమైన సంఖ్యను ఎన్నికల అధికారులు ప్రకటించాల్సి ఉంది. ఈనెల 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు విధించారు. ఆ తర్వాతగానీ నిజంగా ఎంత మంది బరిలో ఉంటారనేది ఖరారుకాదు. ఈనెల 30న పోలింగ్, నవంబరు 2న ఓట్లను లెక్కిస్తారు.

Published by:Madhu Kota
First published:

Tags: Huzurabad By-election 2021, Intermediate exams, Telangana inter board

ఉత్తమ కథలు