Home /News /telangana /

TELANGANA INTER EXAMS BOARD STARTED CLINICAL PSYCHOLOGIST SERVICES EVK

Telangana Inter Exams : ప‌రీక్ష‌లంటే భ‌య‌మా.. అయితే కాల్ చేయండి : క్లినిక‌ల్ సైకాల‌జిస్టు ప్యాన‌ల్‌ ప్ర‌వేశ‌పెట్టిన ఇంట‌ర్ బోర్డు

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Telangana Inter Exams: విద్యార్థుల‌ను అత్యంత ఒత్తిడికి గురి చేసేది ప‌రీక్ష‌లు.. సాధార‌ణంగా చాలా మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు భ‌య‌ప‌డ‌తారు. నిత్యం క్లాసులు విని చ‌దివితేనే ప‌రీక్ష‌లంటే ఒత్తిడికి గుర‌య్యే విద్యార్థుల‌కు క‌రోనాతో మ‌రింత స‌మ‌స్య వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్ బోర్డు క్లినిక‌ల్ సైకాల‌జిస్టు (Clinical Psychologist) స‌హాయాన్ని అందించాల‌ని బోర్డు (Board) నిర్ణ‌యించింది. ఒత్తిడితో ఇబ్బంది ప‌డే విద్యార్థులు వీరికి ఫోన్ చేసి ప‌రిష్కారం పొంద‌వ‌చ్చు.

ఇంకా చదవండి ...
  విద్యార్థుల‌ (Students)ను అత్యంత ఒత్తిడికి గురి చేసేది ప‌రీక్ష‌లు.. సాధారంగా చాలా మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు భ‌య‌ప‌డ‌తారు. నిత్యం క్లాసులు విని చ‌దివితేనే ప‌రీక్ష‌లంటే ఒత్తిడికి గుర‌య్యే విద్యార్థుల‌కు క‌రోనా (Corona)తో మ‌రింత స‌మ‌స్య వ‌చ్చింది. స‌రిగా క్లాసులు కాక‌, ఆన్‌లైన్ క్లాసులు (Online Classes) అర్థం అవ్వ‌క‌పోవ‌డం ప‌రీక్ష‌లు పాస్ అయిన‌ట్టు ప్ర‌మోట్ చేశారు. దీంతో వారికి వారిమీద న‌మ్మ‌కం త‌గ్గి ప‌రీక్ష‌లంటే మ‌రింత భ‌యం ప్రారంభ‌మైంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ (High Court Green Signal) ఇచ్చింది. పరీక్షలు ఆపాలన్న పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈనెల 25 నుంచి పరీక్షలు ఉండగా చివరి నిమిషంలో పిటిషన్‌ (Petition) ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో పిటిషన్‌ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. కోర్టు అందుకు అనుమతించింది.

  ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్‌బోర్డు (Inter Board) స‌రికొత్త నిర్ణ‌యం తీసుకొంది.

  అక్టోబ‌ర్ 25, 2021న ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల స‌మ‌స్య‌ను దృష్టిలో పెట్టుకొని వారికి క్లినిక‌ల్ సైకాల‌జిస్టు (Clinical Psychologist) స‌హాయాన్ని అందించాల‌ని బోర్డు నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి బోర్డు కార్య‌ద‌ర్శి ఒమ‌ర్ జ‌లీల‌ల్ తెలిపారు. ప‌రీక్ష‌ల స‌మ‌యంలో ఆందోళ‌న చెందే విద్యార్థులు వారి స‌మ‌స్య‌ల‌ను ఫోన్ ద్వారా సైకాల‌జిస్టుల‌కు చెప్పుకోవచ్చ‌ని తెలిపారు. ఇందుకోసం సైకాల‌జిస్టు ప్యాన‌ల్‌ను బోర్డు ఏర్పాటు చేసింది.

  Huzurabad By-election 2021 : ఓట‌రు.. ఎటువైపు? అంత‌ప‌ట్ట‌ని ప్ర‌జా నాడి.. తలలు పట్టుకుంటున్న ప్రధాన పార్టీలు


  ఈ ప్యాన‌ల్‌లో అనిత ఆరే - 91549 51704, శ్రీ‌ల‌త - 91549 51703, శైల‌జ పిశాపాటి - 91549 51706, అనుప‌మ - 91549 51687, ర‌జినీ తెనాలి - 91549 51695, మేజ‌ర్ ఆలీ - 91549 51977, జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ - 91549 516999 ఉన్నారు. ఈ నంబ‌ర్ల‌కు విద్యార్థులు ఫోన్ చేసి వారి స‌మ‌స్య‌ల‌ను వివ‌రించుకోవ‌చ్చు. స‌రైన ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని బోర్డు తెలిపింది.

  ప‌రీక్ష‌ల రివైజ్డ్ టైం టేబుల్‌..
  • అక్టోబ‌ర్ 25, 2021 సెకండ్‌ లాంగ్వేజ్‌
  • అక్టోబ‌ర్ 26, 2021 ఇంగ్లీష్‌
  • అక్టోబ‌ర్ 27, 2021 పేపర్‌-1ఏ, బోటని, పొలిటిక‌ల్ సైన్స్‌
  • అక్టోబర్ 28, 2021 మ్యాథ్స్‌ పేపర్‌-1బీ, జువాలజీ , హిస్టరీ
  • అక్టోబ‌ర్ 31, 2021 ఫిజిక్స్‌, ఎక‌న‌మిక్స్‌
  • న‌వంబ‌ర్ 01, 2021 కెమిస్ట్రీ, కామ‌ర్స్‌
  • న‌వంబ‌ర్ 02, 2021 ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌, బ్రిడ్జి కోర్సు, మ్యాథ్స్
  • న‌వంబ‌ర్ 03, 2021 మోడ‌ర‌న్ లాంగ్వేజ్‌, జియోగ్ర‌ఫీ

  రీషెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్‌ 29న జరగాల్సిన పరీక్షలను అక్టోబర్‌ 31న నిర్వహిస్తారు. అలాగే, అక్టోబ‌ర్ 30న జరగాల్సిన పరీక్షలను నవంబర్‌ 1న పెడతారు.

  ప‌రీక్షల‌కు అనుమ‌తి..
  ఫస్టియర్‌ పరీక్షలు ఆపాలంటూ తెలంగాణ తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. కరోనా నేపథ్యంలో ద్వితీయ సంవత్సరానికి ఐదు నెలల క్రితం ప్రమోట్‌ చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న దాదాపు 4.58 లక్షల మంది విద్యార్థులకు 25వ తేదీ నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియెట్‌ బోర్డు నిర్ణయించిందని తెలిపారు. ఇప్పుడు ప్రథమ సంవత్సరం పరీక్షలు కూడా రాయకపోతే భవిçష్యత్తులో ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి వస్తే వీరి ప్రతిభను అంచనా వేయడం ఇబ్బందికరంగా మారుతుందని నివేదించారు. ఆ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పరీక్షల నిర్వహణకు రెండు రోజుల ముందు పిటిషన్‌ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. దీంతో పిటిషన్‌ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న వినతిమేరకు ధర్మాసనం అనుమతించింది.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Intermediate exams, Students, Telangana, Telangana students

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు