• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA INTER BOARD UPDATES STUDENT UNIONS AND REVANTH REDDY PROTEST INFRONT NAMPALLY INTER BOARD OFFICE MS

తెలంగాణ ఇంటర్ బోర్డుపై కథనాలు : భగ్గుమంటోన్న విద్యార్థి లోకం.. రేవంత్ రెడ్డి ధర్నా

తెలంగాణ ఇంటర్ బోర్డుపై కథనాలు : భగ్గుమంటోన్న విద్యార్థి లోకం.. రేవంత్ రెడ్డి ధర్నా

తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట రేవంత్ రెడ్డి, విద్యార్థుల ధర్నా

Telangana Inter Board : ఇంటర్ బోర్డు తప్పిదాలతో తమకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రీవాల్యుయేషన్‌, రీవెరిఫికేషన్‌ ఉచితంగా జరిపించాలని, అవకతవకలకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సోమవారం పలు విద్యార్థి సంఘాలతో పాటు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటర్ బోర్డు ఎదుట ధర్నా చేశారు.

  • Share this:
    ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత.. : తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల్లో తప్పిదాలపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇంటర్ బోర్డు హడావుడిగా మార్కులను విడుదల చేయడంతో పరీక్షలు బాగా రాసిన విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారని వారు ఆరోపిస్తున్నారు. పరీక్షల్లో ఫెయిలై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పలు విద్యార్థి సంఘాలు తెలంగాణ ఇంటర్ బోర్డు ముట్టడికి ప్రయత్నించాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇంటర్ బోర్డు ఎదుట రేవంత్ రెడ్డి ధర్నా... : ఇంటర్ బోర్డు వైఫల్యాలపై ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు మెరుపు ధర్నాకు దిగారు.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి. ఫలితాలు విడుదల తర్వాత ఇంటర్ బోర్డు అక్రమాలపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో వారికి మద్దతు తెలుపుతూ రేవంత్ రెడ్డి ధర్నా నిర్వహించారు. దీంతో రేవంత్‌తో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అద్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్ స్టేషనుకి తరలించారు పోలీసులు. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


    ఇంటర్‌లో ఫెయిల్ అయినందుకు టీడీపీ ఎంపీ మేనల్లుడి ఆత్మహత్య... : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. హైదరాబాద్‌లో ఆయన మేనల్లుడు ధర్మారామ్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనగర్‌లో ఓ ఏడంతస్తుల భవనం పై నుంచి దూకి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యులు, స్థానికులను అడిగి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ‘గుండె తరుక్కుపోతోంది’ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై హరీశ్‌రావు ఆవేదన :  తెలంగాణలో తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాలు... చర్చనీయాంశంగా మారాయి. ఫలితాలు తారుమారు అయ్యాయని కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే.. మరికొందరు విద్యార్థులు మాత్రం ప్రాణాలు బలితీసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంటర్ రిజల్ట్ప్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో ఆరుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై హరీశ్ రావు భావోద్వేగంగా స్పందించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇంటర్ బోర్డులో ‘తప్పుల’కు కారణం చెప్పిన మంత్రి.. : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విషయంలో చోటుచేసుకున్న గందరగోళంపై రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి తో పాటు ఇతర ఉన్నత అధికారులతో సమీక్షించారు. ఫలితాల విషయంలో తల్లితండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. కొంతమంది అధికారుల అంతర్గత తగదాలతో ఈ అపోహలు సృష్టించబడినట్టు తమ దృష్టికి వచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... న్యూస్18 తెలుగులో చెక్ చేసుకోండి : తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు గత వారమే విడుదలయ్యాయి. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఆలస్యం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో ఆందోళన కాస్తా తీవ్రమైంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    మెమోల్లో వచ్చిన తప్పులపై ఆందోళన వద్దు -ఇంటర్ బోర్డు : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై ఇంటర్ బోర్డు వివరణ ఇచ్చింది. మెమోల్లో వచ్చిన తప్పులపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని సూచించారు. తాము పరీక్షకు హాజరైనా మార్కలుు ఇవ్వకుండా ఇంటర్ ధ్రువపత్రాల్లో ఏఎఫ్, ఏపీ అని రావడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షకు హాజరుకాకపోతే ఆబ్సెంట్(ఏబీ) అని ఉండాలి. అలా కాకుండా ఏఎఫ్, ఏపీ అని ఉండడంతో వాటి అర్థం తెలియక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

     
    First published:

    అగ్ర కథనాలు