• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA INTER BOARD SECRETARY JANARDHAN APPEAL TO STUDENTS OVER SUICIDES MS

విద్యార్థులు ఆందోళన చెందవద్దు.. దోషులకు కఠిన శిక్షలు తప్పవు : ఇంటర్ బోర్డ్ కార్యదర్శి

విద్యార్థులు ఆందోళన చెందవద్దు.. దోషులకు కఠిన శిక్షలు తప్పవు : ఇంటర్ బోర్డ్ కార్యదర్శి

ఇంటర్ బోర్డు ఎదుట విద్యార్థుల ఆందోళన (File)

Telangana Inter Board Issue : ఓఎమ్మార్‌ షీట్‌లో తప్పులు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, గతంలో ఉన్న చట్టాల కంటే కొత్త చట్టాలు తీసుకొస్తామని చెప్పారు. జరిమానాను పెంచుతామని చెప్పారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఫెయిలైతే మళ్లీ పరీక్షలు రాయవచ్చు గానీ ప్రాణం పోతే మళ్లీ తిరిగి రాదని అన్నారు.

  • Share this:
    ఇంటర్మీడియట్ బోర్డులో అవకతవకలపై విద్యార్థులు ఆందోళన బాట పట్టడం పట్ల విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి స్పందించారు. సమస్యపై ఇంటర్మీడియట్ బోర్డ్ సీఎస్‌తో చర్చించినట్టు తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాలపై ఎవరూ ఆందోళన చెందవద్దని.. 25వ తేదీ వరకు సమయం ఉందని చెప్పారు. ఇప్పటివరకు 9వేల దరఖాస్తులు అందాయని తెలిపారు. రీ-వెరిఫికేషన్‌కు రూ.600, రీ కౌంటింగ్‌కు రూ.600 చెల్లించి అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. సాఫ్ట్‌వేర్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో దానిపై కమిటీ విచారణ కొనసాగుతోందని.. నివేదిక వచ్చాక దోషులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

    ఓఎమ్మార్‌ షీట్‌లో తప్పులు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, గతంలో ఉన్న చట్టాల కంటే కొత్త చట్టాలు తీసుకొస్తామని చెప్పారు. జరిమానాను పెంచుతామని చెప్పారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఫెయిలైతే మళ్లీ పరీక్షలు రాయవచ్చు గానీ ప్రాణం పోతే మళ్లీ తిరిగి రాదని అన్నారు. పేపర్ మూల్యాంకనంలో తప్పులు జరిగితే తప్పక న్యాయం జరుగుతుందన్నారు. అయితే పరీక్ష సరిగా రాయకపోయి ఫెయిలైతే మాత్రం వేరే చదువుల వైపు వెళ్లవచ్చని చెప్పారు.తల్లిదండ్రులు కూడా పిల్లలను గమనిస్తూ ఉండాలని.. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రతీ 10మంది విద్యార్థులకు ఒక స్వశక్తి సంఘం ఏర్పాటు చేస్తామని చెప్పారు. తద్వారా విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే వారితో చెప్పవచ్చునని తెలిపారు.
    First published:

    అగ్ర కథనాలు