ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసి ఇంటర్ ఆన్సర్ షీట్లు ఫ్రీగా తీసుకోవచ్చా?

విద్యార్థులు ఎవరూ తమ ఆన్సర్ షీట్ల కోసం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని, సమాచార హక్కు చట్టం ద్వారా రూ.10 పెట్టి దరఖాస్తు చేసుకుంటే ఆన్సర్ షీట్లు వస్తాయంటూ సోషల్ మీడియాలో ఓ వార్త సర్క్యులేట్ అవుతోంది.

news18-telugu
Updated: April 26, 2019, 4:21 PM IST
ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసి ఇంటర్ ఆన్సర్ షీట్లు ఫ్రీగా తీసుకోవచ్చా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ఇంటర్ బోర్డు ఫలితాలు పెద్ద దుమారం రేపాయి. టాపర్లకు కూడా సున్నా మార్కులు రావడంతో సంచలనానికి దారితీశాయి. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం, ఆవేదనతో ఉన్నారు. ఇంటర్ బోర్డు మాత్రం తాపీగా, ఫెయిలైన వారికి రీవెరిఫికేషన్ ఫ్రీగా చేస్తామని ప్రకటించింది. పాస్ అయిన వారు మాత్రం రూ.600 కట్టి రీ వెరిఫికేషన్ చేయించుకోవాలని ఉచిత సలహా ఇచ్చింది. ఒక్కో సబ్జెక్టుకు రూ.600 అంటే, ఆరింటికి కలిపి రూ.3600 చెల్లించాలి. ఇంటర్ బోర్డు చేసిన తప్పులకు తామెందుకు డబ్బులు కట్టాలని పాస్ అయినా కూడా తమకు తక్కువ మార్కులు వచ్చాయని సంశయంలో ఉన్న విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

ఇంటర్ బోర్డు ఫీజు కట్టి రీవెరిఫికేషన్ చేసుకోమని సూచించిన తర్వాత ఓ సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థులు ఎవరూ తమ ఆన్సర్ షీట్ల కోసం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని, సమాచార హక్కు చట్టం ద్వారా రూ.10 పెట్టి దరఖాస్తు చేసుకుంటే ఆన్సర్ షీట్లు వస్తాయనేది ఆ వార్త సారాంశం. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారయితే ఆ రూ.10 కూడా కట్టాల్సిన పనిలేదంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ts inter results 2019,telangana inter results,ts inter results,ts inter results date 2019,inter results issue,mistakes in inter results,ts inter results date,inter ts results 2019,inter results 2019,ts inter results release,ts inter results 2019 date,ts inter results 2nd year 2019,ts inter 1st year results 2019,ts inter 2nd year results 2019,ts inter result 2019,Right to information act,RTI,RTI Inter answer sheet,తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఆర్టీఐ దరఖాస్తు, ఇంటర్ రీవాల్యుయేషన్,ఇంటర్ రీ వెరిఫికేషన్,ఇంటర్ రీ కౌంటింగ్,ఇంటర్ ఫలితాల గొడవ,ఇంటర్ విద్యార్థుల ఆందోళన,
విద్యార్థి సంఘాల ధర్నా

ఈ సోషల్ మీడియా ప్రచారంపై ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నా, ఆన్సర్ షీట్లు ఇవ్వబోమని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ప్రభుత్వం జీవో నెంబర్ 454 ప్రకారం అది ‘పెయిడ్ మెటీరియల్’ అని స్పష్టం చేసింది. కాబట్టి, ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, ఆన్సర్ షీట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది.

ts inter results 2019,telangana inter results,ts inter results,ts inter results date 2019,inter results issue,mistakes in inter results,ts inter results date,inter ts results 2019,inter results 2019,ts inter results release,ts inter results 2019 date,ts inter results 2nd year 2019,ts inter 1st year results 2019,ts inter 2nd year results 2019,ts inter result 2019,Right to information act,RTI,RTI Inter answer sheet,తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఆర్టీఐ దరఖాస్తు, ఇంటర్ రీవాల్యుయేషన్,ఇంటర్ రీ వెరిఫికేషన్,ఇంటర్ రీ కౌంటింగ్,ఇంటర్ ఫలితాల గొడవ,ఇంటర్ విద్యార్థుల ఆందోళన,
తెలంగాణ ఇంటర్ ఫలితాలు, గ్లోబరీనా టెక్నాలజీస్

అయితే, ఆన్సర్ షీట్లు కూడా సమాచార హక్కు చట్టంలో భాగమే అని, వాటిని పొందే హక్కు పరీక్ష రాసిన వారికి ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఇంటర్ బోర్డు బేఖాతర్ చేస్తోందని కొందరు వాదిస్తున్నారు. 2001లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆర్టీఐ కింద ఆన్సర్ షీట్ పొందడానికి సదరు పరీక్షార్ధికి అన్ని హక్కులు ఉంటాయి. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 2 (f) కింద కచ్చితంగా ఆన్సర్ షీట్లు కూడా ఇవ్వాల్సిందే అని స్పష్టం చేసింది. అయితే, ఇంటర్ బోర్డు మాత్రం ప్రభుత్వ జీవో పేరు చెప్పి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 26, 2019, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading