ఇంటర్ బోర్డు నిర్వాకం : ఫెయిల్ అయ్యాడో.. పాస్ అయ్యాడో తెలియని అయోమయంలో ఓ స్టూడెంట్

Telangana Inter Board Failures : రీవెరిఫికేషన్‌కు ఈ నెల 27 వరకు గడువు ఉండటంతో.. తాను ఫీజు చెల్లించాలా వద్దా అన్న అయోమయంలో ప్రస్తుతం రెహాన్ ఉన్నాడు. తాను పాస్ అయ్యానో.. ఫెయిల్ అయ్యానో.. క్లారిటీ వస్తే ఫీజు చెల్లించాలని భావిస్తున్నాడు.

news18-telugu
Updated: April 25, 2019, 8:58 AM IST
ఇంటర్ బోర్డు నిర్వాకం :  ఫెయిల్ అయ్యాడో.. పాస్ అయ్యాడో తెలియని అయోమయంలో ఓ స్టూడెంట్
ఇంటర్ బోర్డు ఎదుట విద్యార్థుల ఆందోళన (File)
  • Share this:
తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకాలు బయటపడుతూనే ఉన్నాయి. సాంకేతిక కారణాలతో విద్యార్థుల ఫలితాలు తప్పుల తడకగా మారాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ విద్యార్థి 17 మార్కులకే పాస్ అయినట్టు మెమో రాగా.. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రెహాన్ అనే విద్యార్థికి పాస్ మెమో, ఫెయిల్ మెమో రెండూ వచ్చాయి. దీంతో తాను ఫెయిల్ అయినట్టా.. పాస్ అయినట్టా.. తెలియక ప్రిన్సిపాల్‌ను సంప్రదించాడు. ప్రిన్సిపాల్ ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాడు.

రెహాన్ మొదట మెమో డౌన్‌లోడ్ చేసుకోగా.. పాస్ అయినట్టుగా వచ్చింది. తర్వాత మరోసారి డౌన్‌లోడ్ చేయగా.. మ్యాథ్స్ పేపర్-2Bలో ఫెయిల్ అయినట్టుగా వచ్చింది. మొదట డౌన్‌లోడ్ చేసుకున్న మెమోలో మ్యాథ్స్-బిలో 31 మార్కులు వచ్చినట్టుగా ఉండగా.. మరో మెమోలో మాత్రం 13 మార్కులతో ఫెయిల్ అయినట్టుగా ఉంది. దీంతో రెహాన్‌కు తాను పాస్ అయ్యానో.. ఫెయిల్ అయ్యానో తనకే తెలియలేదు.

రీవెరిఫికేషన్‌కు ఈ నెల 27 వరకు గడువు ఉండటంతో.. తాను ఫీజు చెల్లించాలా వద్దా అన్న అయోమయంలో ప్రస్తుతం రెహాన్ ఉన్నాడు. తాను పాస్ అయ్యానో.. ఫెయిల్ అయ్యానో.. క్లారిటీ వస్తే ఫీజు చెల్లించాలని భావిస్తున్నాడు. ప్రిన్సిపాల్ ఇంటర్ బోర్డు అధికారులతో మాట్లాడుతానని చెప్పినప్పటికీ.. ఎప్పటిలోగా స్పష్టత వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నాడు.దీంతో పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలతో ఎట్టకేలకు సీఎం కేసీఆర్ వివాదంపై స్పందించారు. ఫెయిలైన విద్యార్థులకు ఫ్రీ వెరిఫికేషన్, రీ వెరిఫికేషన్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
First published: April 25, 2019, 8:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading