Home /News /telangana /

Hyderabad : క్వాలిటీ ఐటి సేవలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్.. గ్లోబల్ సమ్మిట్‌‌లో వక్తలు..

Hyderabad : క్వాలిటీ ఐటి సేవలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్.. గ్లోబల్ సమ్మిట్‌‌లో వక్తలు..

global summit

global summit

Hyderabad : ఐటిలో క్వాలిటి సేవలకు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ మారిందని తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ సందీప్ ముఖ్తాల అన్నారు. ఇందుకోసం టీటా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

  హైద‌రాబాద్‌లోని హోట‌ల్ ఐటీసీ కాక‌తీయ‌లో "గ్లోబ‌ల్ స‌మ్మిట్ ఆన్ క్వాలిటీ" ( global summit on quality ) ఆండ్‌ క‌న్జ్యూమ‌ర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే ప్రముఖ ఐటి దిగ్గజాలతోపాటు ఇతర పారీశ్రామిక వేత్తలు పాల్గోన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే క్వాలిటీ అండ్ కన్స్యూమర్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ అందించిన సేవలను సమ్మిట్ ప్రతినిధులు కొనియాడారు. ఐటీ అభివృద్దిలో టీటా సేవలపై ప్రశంసలు కురిపించారు. ( global summit on quality )ఈ క్రమంలోనే టెక్నాలజీని గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లడంలో నాణ్య‌మైన సేవ‌లు అందించింద‌ని అంతర్జాతీయ వినియోగ‌దారుల సేవ‌ల స‌మ్మిట్ ప్ర‌శంసించింది.

  కాగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌వంబ‌ర్ నెల‌ను `వ‌ర‌ల్డ్ క్వాలిటీ మంత్` పేరుతో ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుండ‌గా భార‌త‌దేశానికి సంబంధించి హైబ్రిడ్ విధానంలో హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్‌లో `క్వాలిటీ & ది క‌న్జ్యూమ‌ర్‌` కార్య‌క్ర‌మం నిర్వ‌హించామని ఈ కార్యక్రమానికి డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ‌రేట‌రీ చైర్మ‌న్ స‌తీష్ రెడ్డి , ఐసీఎంఆర్ మాజీ డీజీ ప్రొఫెస‌ర్ నిర్మ‌ల్ కుమార్ గంగూలీ, రిటైర్డ్ ఐఏఎస్ వ‌జావ‌త్ హ‌బీబుల్లా, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మ‌న్ ఆదిల్ జైనుల్ భాయ్‌, తెలంగాణ రాష్ట్ర నీటి వ‌న‌రుల అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ వి. ప్ర‌కాష్ , క‌న్జ్యూమ‌ర్ ఆన్‌లైన్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ బెజాన్ మిశ్రాతో పాటుగా వివిధ రంగాల‌కు చెందిన నిపుణులు ఈ స‌మ్మిట్ నిర్వ‌హించారు.( global summit on quality ) స‌ద‌స్సులో టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌ఖ్త‌ల‌ను దిగ్గజ ఔష‌ధ సంస్థ డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ‌రేట‌రీస్ చైర్మ‌న్ స‌తీష్ రెడ్డి సహా ప్రముఖులు స‌న్మానించారు.

  Sardar Ravinder sing : నామినేషన్ వేశాడు.. కాని ఓటర్లు.. క్యాంపులో ఉంటే ప్రచారం ఎట్లా చేసేది...?


  ఈ సంద‌ర్భంగా టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌ఖ్త‌ల మాట్లాడుతూ క్వాలిటీ ఐటీ సేవ‌లు కావాలనుకుంటే హైద‌రాబాద్ గ‌మ్య‌స్థానంగా మారింద‌ని ఇందులో టీటా కీల‌క‌ పాత్ర పోషించింద‌ని తెలిపారు. 2013-14లో 3.23ల‌క్ష‌ల ఉద్యోగాల‌తో 57,000 కోట్ల ఐటీ ఎగుమ‌తులు న‌మోదు అయ్యాయ‌ని గుర్తు చేశారు. ( global summit on quality )2020-21లో 6,28,615 ఉద్యోగాలు,1.45లక్షల కోట్ల రూపాయ‌ల ఐటీ ఎగుమ‌తులను ప‌రిశ్ర‌మ న‌మోదు చేసుకుంద‌ని వెల్ల‌డించారు. ఈ వృద్దిలో టీటా కీల‌క పాత్ర పోషించింద‌ని, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ పాత్ర‌ను గుర్తించి వ‌రుస‌గా మూడు సంవ‌త్స‌రాలు అవార్డులు అందించింద‌ని తెలిపారు. ( global summit on quality ) నాణ్య‌మైన ఉద్యోగుల సేవ‌ల‌ను అందించడంలో టీటా కీల‌క పాత్ర పోషించింద‌న్నారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ రంగంలో నిపుణులైన ఉద్యోగుల‌ను తీర్చిదిద్దుతున్నామ‌ని సందీప్ మ‌ఖ్త‌ల తెలిపారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోని విద్యార్థుల‌కు కోడింగ్ నైపుణ్యాల్లో శిక్ష‌ణ ఇస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

  మీ నగరం నుండి (​హైదరాబాద్)

  తెలంగాణ
  ​హైదరాబాద్
  తెలంగాణ
  ​హైదరాబాద్
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Hyderabad, Telangana

  తదుపరి వార్తలు