TSRTC: హైదరాబాద్‌లో రోడ్డెక్కనున్న బస్సులు... అధికారుల ఏర్పాట్లు... ఎప్పటి నుంచంటే...

Hyderabad RTC Buses: ప్రభుత్వం, అధికారులు, ప్రజలు... అందరూ హైదరాబాద్‌లో బస్సులు తిరిగితే బాగుండని చూస్తున్నారు. ఇందుకు అధికారులు ఇప్పుడు ఏర్పాట్లు జోరుగా చేస్తున్నారు.

news18-telugu
Updated: September 23, 2020, 6:07 AM IST
TSRTC: హైదరాబాద్‌లో రోడ్డెక్కనున్న బస్సులు... అధికారుల ఏర్పాట్లు... ఎప్పటి నుంచంటే...
హైదరాబాద్‌లో రోడ్డెక్కనున్న బస్సులు... అధికారుల ఏర్పాట్లు (File)
  • Share this:
Hyderabad RTC Buses: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గాయి. కొత్త కేసులు ఇదివరకటి కంటే తక్కువగానే నమోదవుతున్నాయి. వాటిలో 70 శాతం కేసుల్లో అసలు లక్షణాలే కనిపించట్లేదు. పైగా వాళ్లంతా ఇళ్లలోనే ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకొని రికవరీ అయిపోతున్నారు. మరణాలైతే... ప్రతి 1000 మందిలో ఆరుగురు మాత్రమే కరోనా వల్ల చనిపోతున్నారు. ఇంతలా కరోనా కంట్రోల్ అవ్వడంతో... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్సులు నడపాలనే ఆలోచనకు వచ్చారు తెలంగాణ ఆర్టీసీ అధికారులు. ఇప్పటికే మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ప్రయాణికులు కూడా ఇప్పుడిప్పుడే ఆ రైళ్లలో ప్రయాణాలు చేస్తున్నారు. ఇక బస్సులు కూడా నడిపితే ఏమవుతుందనే ప్రశ్న వేసుకున్నారు అధికారులు. తెలంగాణలో కంటే 70 శాతం ఎక్కువ కేసులు నమోదవుతున్న ఏపీలో... విజయవాడ, విశాఖపట్నంలో బస్సులు తిప్పుతున్నప్పుడు... హైదరాబాద్‌లో కూడా సర్వీసులు ప్రారంభిస్తే బెటరనే అభిప్రాయంతో ఉన్నారు అధికారులు.

Apsrtc buses, telangana buses, buses between andhra Pradesh and telangana, ap new, apsrtc bookings, tsrtc bookings, ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు, తెలంగాణ బస్సులు, ఏపీ తెలంగాణ మధ్య బస్సులు, ఏపీ న్యూస్, ఆర్టీసీ బుక్సింగ్
హైదరాబాద్‌లో రోడ్డెక్కనున్న బస్సులు... అధికారుల ఏర్పాట్లు


తెలంగాణ సీఎం కేసీఆర్... మొదటి నుంచి కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉన్నారు. లాక్‌డౌన్ల విషయంలోనూ కేంద్రం కంటే ఎక్కువ రోజులు విధించారు. జిల్లాల్లో బస్సుల విషయంలో కంట్రోల్ ఉంటుందనీ, ప్రయాణికులు రూల్స్ పాటించేలా చేయడం వీలవుతుందనీ... అదే సిటీలో అయితే... బస్సులు కిక్కిరిసిపోతాయి కాబట్టి కరోనా విజృంభించే ప్రమాదం ఉందని ప్రభుత్వం మొదటి నుంచి సిటీ సర్వీసుల విషయంలో కుదరదని చెబుతోంది. ఇప్పుడు ఈ అభిప్రాయం మారిందనీ... నెలాఖరు నాటికి లేదా అక్టోబర్ ఆరంభంలో సిటీలో బస్సు సర్వీసుల ప్రారంభంపై ప్రకటన వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ముంబై, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో బస్సులు నడుస్తున్నాయి. బస్సుల్లో సగం సీట్లను ఖాళీగానే ఉంచుతున్నారు. అందుకు తగ్గట్లే టికెట్ల రేట్లు కూడా ఉంటున్నాయి. సేఫ్ డిస్టాన్స్ పాటించేలా చేస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఈ రూల్స్ పక్కాగా పాటించేలా చేస్తామని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. అందువల్ల ఈ అంశంపై సర్కారు సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది.

హైదరాబాద్‌లో రోడ్డెక్కనున్న బస్సులు... అధికారుల ఏర్పాట్లు


హైదరాబాద్‌లో మార్చి 22 నుంచి బస్సు సర్వీసులు ఆగిపోయాయి. ఆరు నెలలుగా బస్సులు డిపోల్లోనే ఉన్నాయి. టీఎస్ ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. కరోనాకి ముందు టీఎస్ ఆర్టీసీ 1400 రూట్లలో 3వేలకు పైగా బస్సులతో 43వేల ట్రిప్పులు నడిపేది. రోజూ 30 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. బస్సులు తిరిగి ప్రారంభమైతే... అన్నీ చక్కబడతాయనే అభిప్రాయం అధికారుల్లో ఉంది.
Published by: Krishna Kumar N
First published: September 23, 2020, 6:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading