హోమ్ /వార్తలు /తెలంగాణ /

బుల్లెట్టు బండి సాంగ్‌తో పాపులరైన పెళ్లి కొడుకు .. అవినీతి ఉద్యోగిగా ఏసీబీకి చిక్కాడు 

బుల్లెట్టు బండి సాంగ్‌తో పాపులరైన పెళ్లి కొడుకు .. అవినీతి ఉద్యోగిగా ఏసీబీకి చిక్కాడు 

అశోక్ (ఫైల్)

అశోక్ (ఫైల్)

Telangana: కొద్ది రోజుల క్రితం సోష‌ల్ మీడియాలో వైరల్ అయిన బుల్లెట్ బండి సాంగ్ కు డ్యాన్స్ చేసిన క‌పుల్ మ‌నంద‌రికి గుర్తుండే ఉంటారు అయితే ఆ సాంగ్ లో ఉన్న వ‌రుడు ఇప్పుడు మ‌ళ్లీ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

M.Balakrishna, News 18, Hyderabad.

సోష‌ల్ మీడియా లో మంచి ఎంత స్పీడ్ గా ప్ర‌చారం అవుతుందో అదే స్థాయిలో చెడు కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చేస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం సోష‌ల్ మీడియాలో వైరల్ అయిన బుల్లెట్ బండి సాంగ్ కు డ్యాన్స్ చేసిన క‌పుల్ మ‌నంద‌రికి గుర్తుండే ఉంటారు అయితే ఆ సాంగ్ లో ఉన్న వ‌రుడు ఇప్పుడు మ‌ళ్లీ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాడు. తాజాగా 30 వేలు లంచం డిమాండ్ చేస్తూ అవినీతి నిరోధ‌క శాఖ అధికారుల‌కు దొరికి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నారు మ‌ళ్లీ ఈ వైర‌ల్ క‌పుల్.

వివ‌రాల్లోకి వెళ్తే...బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ ఆకుల అశోక్ మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి రెడ్ హ్యాండెడ్‌గా ట్రాప్ అయ్యాడు. ఈ కేసులో అశోక్‌తో పాటు ఆర్కిటెక్ట్ ఏ శ్రీనివాసరాజును ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. సరూర్‌నగర్‌లోని జేబీ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి పిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారుల‌ను అశోక్ ను రెడ్ హ్యండెడ్ గా ప‌ట్టుకున్నారు, ఫిర్యాదుదారుడి ప్లాట్లకు సంబంధించి ఇంటి నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు ఫిర్యాదుదారుడు ఏ దేవేందర్ రెడ్డి నుంచి అశోక్ 30 వేలు లంచం డిమాండ్ చేశాడు. శ్రీనివాసరాజు అశోక్ కు లంచం ఇస్తోన్న‌ప్పుడే అధికారులు ట్రాప్ చేసి ప‌ట్టుకున్నారు.

అశోక్ ఆఫీస్ టేబుల్ డ్రాలో రూ.30వేలు లంచం రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. అశోక్, రాజులను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. టౌన్‌ ప్లానింగ్ అధికారిగా పని చేస్తున్న అశోక్‌ సుమారు రెండేళ్ల క్రితం ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఆయన వివాహం ముగిసిన తర్వాత ఊరేగింపు కార్యక్రమంలో అశోక్‌ సతీమణి నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా అన్న పాటతో భార్యభర్తలిద్దరూ పాపులర్ అయ్యారు. ఒక్క పాటతో తెలంగాణలోనే కాదు చాలా మందికి గుర్తిండి పోయింది ఈజంట. అయితే బ్యాడ్‌ లక్ ఏంటంటే అంత పాపులారిటీ సంపాధించుకోవడం కారణంగా ఇప్పుడు లంచం తీసుకొని దొరికిపోవడంతో అంతే వేగంగా సోషల్ మీడియాలో అశోక్‌ పేరు అవినీతి అధికారి ఇతనే అంటూ వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే ఎవ‌రైన సోష‌ల్ లంచం డిమాండ్ చేస్తే వెంట‌నే అధికారుల‌ను సంప్ర‌దించాల‌ని కోరుతున్నారు అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు. ఇందుకోసం ప్ర‌త్యేక‌మైన టోల్ ఫ్రీ నెంబ‌ర్లు ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఎవరైనా ప్రభుత్వోద్యోగి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని అధికారులు ప్రజలను కోరారు లంచం డిమాండ్ చేసిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామంటున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Hyderabad, Telangana News

ఉత్తమ కథలు