హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఒకరి బిడ్డ మరొకరికి అప్పగింత.. సంతకాలు కూడా తీసేసుకున్నారు.. ఆరోగ్యశాఖ మంత్రి ఇలాకాలో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం..

Telangana: ఒకరి బిడ్డ మరొకరికి అప్పగింత.. సంతకాలు కూడా తీసేసుకున్నారు.. ఆరోగ్యశాఖ మంత్రి ఇలాకాలో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం..

ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇలాకాలోని హుజరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  .కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి లీలలు రోజుకు ఒక్కటి వెలుగు చూస్తున్నాయి.రెండు రోజుల క్రితం సెలైన్ బాటిల్ తో కారు కడిగిన సిబ్బంది తాజాగా ఒకరికి డెలివరీ అయిన పాపను మరొకరికి అప్పగించారు. అసలు పాప పేరెంట్స్ నిలదీయగా తిరిగి వారి పాపను వాళ్లకు అప్పగించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సొంత ఇలాకాలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఒక మహిళ వైద్యురాలు తన కారును కింది స్థాయి సిబ్బందితో కడిగించిన విషయం వెలుగులోకి తెచ్చింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా ఆస్పత్రి సిబ్బంది ఓ గర్భిణికి జన్మించిన బిడ్డను మరొకరికి అప్పగించిన సంఘటన కలకలం రేపింది.

  భీందేవ్రపల్లి మండలం కొప్పుర్ గ్రామానికి చెందిన విజయ్ -రచనలకు ఇదివరకే ఒక కూతురు ఉంది. రచన మరోసారి గర్భం దాల్చడంతో ప్రసవం కోసం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. మరోవైపు ఎల్కతుర్తి మండలం జగన్నాధపుర్ గ్రామానికి చెందిన మధుకర్ భార్య రజిత అదే ఆసుపత్రి లో ప్రసవం కోసం చేరారు. అయితే రజిత కు ప్రసవం అయి పాప జన్మించింది. అయితే ఆసుపత్రి సిబ్బంది రజిత పేరెంట్స్ కు పాప ను అప్పగించే బదులు ఇంకా ప్రసవం కానీ రచన పేరెంట్స్ కు పాప జన్మించింది అని చెప్పి సంతకాలు తీసుకొని పాపను అప్పజెప్పారు.

  ఆ తర్వాత కొద్ది సేపటి అనంతరం రజిత పేరెంట్స్ వచ్చి ఆసుపత్రి సిబ్బందిని అడుగగా మీ పాప మీకు అప్పజెప్పమని చెప్పారు. దీంతో ఆందోళన చెందిన పాప పేరెంట్స్ సిబ్బంది నీ నిలదీయగా అసలు విషయం తెలుసుకొని రజిత పేరెంట్స్ కు అప్పజెప్పి రచనను ప్రసవం కోసం తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. ఆరోగ్య శాఖ మంత్రి ఇలాకాలోని ప్రభుత్వ ఆసుపత్రి లో రోజుకో వివాదం వెలుగు చూస్తుండడం‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

  First published:

  Tags: Etela rajender, Karimnagar, Telangana

  ఉత్తమ కథలు