Huzurabad byelection 2021 : పోటీ అంతా "ప‌ట్ట‌భ‌ద్రుల" మ‌ధ్యే.. ఆస‌క్తిక‌రంగా హుజూరాబాద్ ఉపఎన్నిక‌

ఈటల రాజేందర్‌, గెల్లు శ్రీనివాస్, బల్మూరి వెంకట్ (ఫైల్ ఫోటోలు)

హుజూరాబాద్ ఉపఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఈసారి ప్ర‌ధాన పార్టీ నుంచి పోటీ చేసే అభ్య‌ర్థులు అంతా గ్రాడ్యుయేట్లే కావ‌డం విశేషం. అంతేకాకుండా నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున నామినేష‌న్ వేసే అవ‌కాశం ఉండ‌డంతో ఉపఎన్నికల్లో పోటీ అంతా ప‌ట్ట‌భ‌ద్రుల మ‌ధ్య ఉండ‌నుంది.

  • Share this:
    తెలంగాణ‌లో హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. ప్ర‌ధానంగా పోటీ చేస్తున్న పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల ముగ్గురూ ఉన్న‌త విద్యావంతులే.  వైఎస్సార్‌టీపీ ఆధ్వర్యంలో 200 మంది నిరుద్యోగులు బరిలో నిలుచుంటామంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీ అభ్య‌ర్థుల విద్యార్హ‌త‌లు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌  అభ్యర్థులు. ముగ్గురూ గ్రాడ్యుయేట్లే (Graduates) కావడం గమనార్హం. హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగా రాజీనా మా చేసి బీజేపీ నుంచి బరిలో ఉన్న ఈటల రాజేందర్‌ ఉస్మానియా నుంచి బీఎస్సీలో డిగ్రీ తీసుకున్నారు. టీఆర్ఎస్‌ నుంచి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా ఉస్మానియా నుంచి ఎంఏ పట్టా పొందారు. కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచిన బల్మూరి వెంకట్‌ కూడా ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్‌ కావడం విశేషం. ముగ్గురూ విద్యార్థి రాజకీయ నేపథ్యమే. దీంతో పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

    పూర్తికాని నామినేష‌న్‌ల ప‌ర్వం..
    ఎన్నిక‌ల్లో నామినేష‌న్ వేసేందుకు ఇంకా నాలుగు రోజులు మాత్ర‌మే ఉంది. ఇప్ప‌టికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మాత్రమే నామినేషన్‌ వేశారు. రాజేందర్‌ (బీజేపీ), బల్మూరి వెంకట్‌ నామినేషన్‌ (Nomination) దాఖలు చేయాల్సి ఉంది. అంతే కాకుండా వైఎస్సార్‌టీపీ ఆధ్వర్యంలో 200 మంది నిరుద్యోగులు బరిలో నిలుచుంటామంటున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చడం లేదన్న కారణంతో ఈసారి దాదాపు 1000 మంది వరకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు (Field Assistant) నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

    Huzurabad bypoll:టీఆర్ఎస్‌కు కొత్త జోష్ -గులాబీ గూటికి దాసరి భూమయ్య -తీన్మార్ మల్లన్న టీమ్ ముక్కలు


    ప్రతీ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసేందుకు కనీసం రూ.10వేల డిపాజిట్.. అభ్యర్థికి మద్దతిస్తూ స్థానికంగా పదిమంది సంతకాలు చేయాలి. దీంతో ఎంత మంది నామినేష‌న్ వేస్తారో చూడాలి.

    అమావాస్య‌తో నామినేష‌న్ ఆల‌స్యం!
    ఉప ఎన్నిక‌ల్లో నామినేష‌న్ వేసేందుకు ఇంకా నాలుగు రోజులు మాత్ర‌మే ఉంది. అక్టోబ‌ర్ 8, 2021తో నామినేష‌న్ వేసేందుకు ఆఖ‌రు తేదీ. ఇప్పటిదాకా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మాత్రమే నామినేషన్‌ వేశారు. రాజేందర్‌ (బీజేపీ), బల్మూరి వెంకట్‌ నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంది. . అక్టోబ‌ర్‌ 2న గాంధీ జయంతి (Gandi Jayanti), అక్టోబరు 3న ఆదివారం సెలవు వచ్చాయి. 6వ తేదీ ఎంగిలిపూల అమావాస్య ఉంది. ఆ రోజు పెద్దగా నామినేషన్లు వేయకపోవచ్చు. ప్ర‌ధాన పార్టీ అభ్య‌ర్థులు ఎలాగు నామినేష‌న్ వేస్తారు. ఇత‌రుల నుంచి మిగిలిన రోజుల్లో ఎన్ని నామినేషన్లు వస్తాయని జనం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

    పోలింగ్‌శాతం పెరిగే అవ‌కాశం
    ఈ సారి ఎన్నికల నిబంధ‌న‌లో వ‌చ్చిన మార్పుల‌తో పోలింగ్  (Polling)పెరిగే అవ‌కాశం ఉంది. మూడు రోజుల ముందే ప్ర‌చారానికి తెర‌ప‌డ‌నుంది. అంతే కాకుండా పోలింగ్ ఉదయం 7నుంచి రాత్రి 7 గంటల వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. దీంతో దూర ప్రాంత వాసులు కూడా పోలింగ్‌లో పాల్గొన వ‌చ్చు. ఈ నేప‌థ్యంలో ఓటింగ్ శాతం పెరుగుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తారు. 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో హుజూరాబాద్‌లో దాదాపు 1.60 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఎన్ని ఓట్లు పోల‌వుతాయో చూడాలి.
    Published by:Sharath Chandra
    First published: