Home /News /telangana /

TELANGANA HUZURABAD BYELECTION ELECTION CODE EFFECTS ON GOVT EMPLOYEES EVK

Huzurabad byelection 2021 : ప్ర‌భుత్వ ఉద్యోగులు జాగ్ర‌త్త‌..! ఉపఎన్నిక‌ల నేప‌థ్యంలో పాటించాల్సిన రూల్స్‌

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నిక‌ల వేడి రాజుకొంది. అన్ని పార్టీలో పోటా పోటీగా ఎన్నికల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాయి. . ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు (Govt Employees) ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా వేటుపడటం ఖాయమే. ఎన్నిల వేళ వారు పాటించాల్సిన రూల్స్ తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నిక‌ల వేడి రాజుకొంది. అన్ని పార్టీలో పోటా పోటీగా ఎన్నికల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh)లోని బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గానికి.. తెలంగాణ‌ (Telangana)లోని హుజూరాబాద్ (Huzurabad) నియోజ‌క‌వ‌ర్గానికి ఉపఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు షెడ్యూల్ విడుద‌ల అయ్యింది. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు (Govt Employees) ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా వేటుపడటం ఖాయమే. ఎన్నికల నిబంధనల అమలులో ప్ర‌స్తుతం ఇరు రాష్ట్రాల్లో ఉన్నతాధికారులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఎన్నిక‌ల‌ ప్రచారంలో పాల్గొన్నా.. మద్దతు తెలిపినా సస్పెన్షన్‌ వేటు పడనుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున అధికారాలు ఎన్నికల సంఘానికి (Election Commission) బదిలీ అయ్యాయి. కావున ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు పాటించాల్సిన‌ జాగ్ర‌త్త‌లు తెలుసుకోండి.

    ఉద్యోగులు పాటించాల్సిన రూల్స్‌..
    - ప్రభుత్వ ఉద్యోగులు తమను ఎవరూ గమనించడం లేదనుకొని ఎవరి సభలోనైనా లేదా సమావేశంలోనైనా పాల్గొన‌వ‌ద్దు.
    - దానికి సంబంధించి వీడియో లేదా ఫొటోలు అధికారులకు అందినా, సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ అయినా జరగాల్సిన నష్టం జరుగుతుంది.
    - కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు బ‌హిరంగంగా ఏదో ఒక రాజకీయ పక్షానికి సానుకూలంగానో, వ్యతిరేకంగానో ఉంటూ సందర్భం వచ్చినప్పుడు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు. ఎన్నిక‌ల వేళ అలాంటి వాటికి దూరంగా ఉండాలి.

    Huzurabad byelection 2021 : పోటీ అంతా "ప‌ట్ట‌భ‌ద్రుల" మ‌ధ్యే.. ఆస‌క్తిక‌రంగా హుజూరాబాద్ ఉపఎన్నిక‌


    - ఎదో ఒక పార్టీకి అనుకూలంగా.. మ‌రో పార్టీపై నింద‌లు వేస్తూ ప్ర‌భుత్వ ఉద్యోగులు మాట్లాడ‌కూడ‌దు.
    - ప్రభుత్వ పథకాలపై నిందలు మోపితే ఎలెక్ష‌న్ క‌మిష‌న్ చ‌ర్య‌లు తీసుకొనే అవ‌కాశం ఉంది.
    - ఒక‌ప్పుడు అంగన్‌వాడీ, ఐకేపీ సిబ్బంది ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనేవారు. గతంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తూనే అంగన్‌వాడీలపై చ‌ర్య‌లు తీసుకొన్నారు.

    సోష‌ల్ మీడియా (Social media)లో జాగ్ర‌త్త‌..
    - ఫేస్‌బుక్, వాట్సాప్‌ గ్రూపుల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా పోస్టులు చేయ‌కూడ‌దు.
    - ఇలా చేసిన వారిన ముందు విధుల నుంచి తొల‌గించాకే త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకొంటారు.

    హుజూరాబాద్‌లో ఉద్యోగుల ఓటు ఎవ‌రికి?
    తెలంగాణ‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుగుతున్నఎన్నిక హుజూరాబాద్ ఉపఎన్నిక. ఇటు బీజేపీ, టీఆర్ఎస్‌ల మ‌ధ్య ప్ర‌ధాన పోటీ నెల‌కొంది. ఇప్ప‌టికే స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు.. ఎత్తుకు పై ఎత్తుల‌తో నియ‌జక‌వ‌ర్గంలో రాజ‌కీయం వేడెక్కింది. ఈ నేప‌థ్యంలో ఆ ప్రాంతంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎటువైపు అనే చ‌ర్చ సాగుతోంది. కొన్ని ప్ర‌భుత్వ ఉద్యోగ‌ సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే, మరికొన్ని ప్రతికూలం అంటున్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని, ఆశించిన ప్రయోజనాలను కల్పించలేకపోయిందన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల్లో సీపీఎస్‌ విధానంపై ప్ర‌భుత్వంపై ఆస‌తృప్తితో ఉన్నారు. ఈ అంశం ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని ఉద్యోగ వ‌ర్గాలు చెబుతున్నాయి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Huzurabad, Huzurabad By-election 2021, Telangana, Telangana employees

    తదుపరి వార్తలు