• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA HOME MINISTER MAHMOOD ALI SAYS MUSLIMS DO RAMZAN PRAYERS AT THEIR HOME AK

ముస్లింలకు హోంమంత్రి కీలక సూచన...

ముస్లింలకు హోంమంత్రి కీలక సూచన...

మహమూద్ అలీ

లాక్‌డౌన్ నేపథ్యంలో ముస్లింలు ఇంట్లోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని తెలంగాణా హోంమంత్రి మహమూద్ అలీ సూచించారు.

  • Share this:
    లాక్‌డౌన్ నేపథ్యంలో ముస్లింలు ఇంట్లోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని తెలంగాణా హోంమంత్రి మహమూద్ అలీ సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన... కోఠి, సుల్తాన్‌ బజార్లో గన్‌ఫౌండ్రీ కార్పొరేటర్ మమత సంతోష్‌గుప్తా ఆధ్వర్యంలో 500 మంది పారిశుధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, కూరగాయలను పంపిణీ చేశారు. కరోనాను తరిమికొట్టేందుకే సీఎం కేసీఆర్ మే 7 వరకూ లాక్‌డౌన్ పొడిగించారని మహమూద్ అలీ తెలిపారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని మహమూద్ అలీ హెచ్చరించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. రాష్ట్రంలో కరోనాకు సంబంధించి పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు