పోలీసు వాహనంపై కూర్చొని...హోంమంత్రి మహమూద్ఆలీ మనవడి వివాదాస్పద టిక్ టాక్...

తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ మనవడు పుర్కాన్ అహ్మద్ తన స్నేహితుడితో కలిసి చేసిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వివాదాస్పద వీడియోలో హోం మంత్రికి కేటాయించిన అధికారిక వాహనంపై ఆయన మనవడు పుర్కాన్ అహ్మద్, అతడి స్నేహితుడుతో కలిసి కూర్చొని టిక్ టాక్ వీడియో చిత్రీకరించారు.

news18-telugu
Updated: July 18, 2019, 6:19 PM IST
పోలీసు వాహనంపై కూర్చొని...హోంమంత్రి మహమూద్ఆలీ మనవడి వివాదాస్పద టిక్ టాక్...
హోమ్ మంత్రి మనవడి టిక్ టాక్ వీడియోలో స్టిల్
news18-telugu
Updated: July 18, 2019, 6:19 PM IST
మొన్న ఖమ్మం కార్పోరేషన్ కార్యాలయంలో ప్రభుత్వం ఉద్యోగులు టిక్ టాక్ వీడియోలు తీసి ఉద్యోగాలు కోల్పోయిన సంఘటన మరువక ముందే, తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ మనవడి టిక్ టాక్ వీడియో మరోసారి వివాదానికి కేంద్రబిందువైంది. వివరాల్లోకి వెళితే తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ మనవడు పుర్కాన్ అహ్మద్ తన స్నేహితుడితో కలిసి చేసిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వివాదాస్పద వీడియోలో హోం మంత్రికి కేటాయించిన అధికారిక వాహనంపై ఆయన మనవడు పుర్కాన్ అహ్మద్, అతడి స్నేహితుడుతో కలిసి కూర్చొని టిక్ టాక్ వీడియో చిత్రీకరించారు.

సదరు వీడియోలో ఒక బాలివుడ్ సినిమాలో పోలీసు అధికారిని పీక కోస్తామని అత్యంత అవమానకరంగా బెదిరించే ఆడియోకు మ్యాచ్ అయ్యేలా హోంమంత్రి మనవడు, అతడి స్నేహితుడు హావభావాలు వ్యక్తం చేస్తూ టిక్‌టాక్ వీడియో చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు శాఖకు చెందిన అధికారిక వాహనంపై కూర్చొని ఇలా అభ్యంతరకరంగా వీడియో చిత్రించడం పట్ల నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఘటనను సీరియస్ గా తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.First published: July 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...